ఫీజుల విషయంలో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం..

ఫీజుల విషయంలో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది.

ఫీజుల విషయంలో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
Fire (file)
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2022 | 3:15 PM

ఫీజుల విషయంలో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. రామాంతాపూర్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు టిసి కోసం ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిని అడిగాడు. ఫీజు బకాయిలు ఉండటంతో టిసి ఇవ్వాడానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు. ఇదే విషయంపై విద్యార్థులు, ప్రిన్సిపల్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈవివాదం చినికి చినికి గాలి వానలా మారింది. టిసి ఇవ్వడం లేదనే బాధతో విద్యార్థి నారాయణ స్వామి ప్రిన్సిపల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అదే సమయంలో అక్కడున్న ప్రిన్సిపల్ తో పాటు మరో వ్యక్తి అశోక్ రెడ్డిని పట్టుకోవడంతో విద్యార్థి నారాయణ స్వామితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ముగ్గురిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.