Telangana: తల్లిదండ్రుల కర్కశత్వం.. కూతురిని సాకలేని తండ్రి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏం చేశాడంటే

కడుపున పుట్టిన చిన్నారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ శిశువును వదిలించుకోవాలనుకున్నారు. భార్య వద్ద ఉన్న పసిపాపను ఎత్తుకెళ్లిన తండ్రి..తాను పోషించలేనని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు...

Telangana: తల్లిదండ్రుల కర్కశత్వం.. కూతురిని సాకలేని తండ్రి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏం చేశాడంటే
Renjal
Follow us

|

Updated on: May 15, 2022 | 9:48 AM

కడుపున పుట్టిన చిన్నారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ శిశువును వదిలించుకోవాలనుకున్నారు. భార్య వద్ద ఉన్న పసిపాపను ఎత్తుకెళ్లిన తండ్రి..తాను పోషించలేనని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు షాక్ గు గురయ్యారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, తిరిగి చిన్నారిని తల్లివద్దకు చేర్చారు. అయితే ఆమెకూ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తానూ పెంచలేనని తేల్చి చెప్పేసింది. నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ కు చెందిన రేణుకకు నీలా గ్రామానికి చెందిన నగేశ్‌ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహమైంది. ఈ నెల 7న వీరికి పాప జన్మించింది. రేణుకకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో రేణుక ఇంటికి వెళ్లిన ఆశా కార్యకర్తలు పాపకు సరిగా పాలు పట్టడం లేదని గుర్తించి నగేశ్ కు సమాచారమందించారు. ఆయన రేణుక వద్దకు వచ్చి పాపను తీసుకెళ్లాడు.

నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తాను సాకలేనని చెప్పాడు. దీంతో పోలీసులు శిశువును తల్లి చెంతకు చేర్చారు. పసికందును తమ వద్ద ఉంచుకునేందుకు నగేశ్, రేణుక కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శిశువు తల్లి వద్దే ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

ఇవి కూడా చదవండి

Tomato Flu: టొమాటో ఫ్లూతో జాగ్రత్త.. చిన్న పిల్లలే దీని టార్గెట్‌..!