Today Tomato Price: టమాట మళ్లీ ఢమాల్.. కోత కూలి కూడా దండగే.. పాపం రైతన్నలు..

టమాటా ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి సెంచరీకి చేరే కిలో టమోటా రేటు..ఇప్పుడు ఒక్కసారిగా ఢమాల్‌ మంది. ఎప్పుడు ఏ ధర ఉంటుందో అర్థంకాక రైతులు అయోమయానికి గురవుతున్నారు.

Today Tomato Price: టమాట మళ్లీ ఢమాల్.. కోత కూలి కూడా దండగే.. పాపం రైతన్నలు..
Tomato Farmers Problems
Follow us

|

Updated on: Jan 27, 2023 | 9:54 AM

కరీంనగర్‌లో టమాటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. కిలో 3 నుంచి 4 రూపాయలే పలుకుతోన్న ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రైతులు ఆందోళనలో ఉన్నారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక రైతులు దిగాలుపడతున్న స్థితి ఆందోళనకరంగా మారింది. ధరపతనం దారుణంగా అవడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధరలు పడిపోతున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహించారు. మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇవ్వడమే కానీ.. ఆచరణ మాత్రం శూన్యమంటున్నారు. రవాణా ఖర్చులు కూడా రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందారు. తక్షణమే మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టన్నులకొద్దీ టమాటాలు పంట పొలాల్లోనే కుళ్ళిపోతున్నాయి. లేదా చెత్తకుప్పలుగా మారుతున్నాయి. రైతన్న కష్టం చిల్లిగవ్వకు కొరగాని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా మార్కెట్‌కు సరుకు ఓ మోస్తారుగా వస్తున్నా.. రేటు పలకడం లేదు. వ్యాపారస్తులు.. దళారులు కుమ్మక్కై రేటు రాకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే చొరవ చూపి రైతులను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. సరైనా ధర లేకపోవడంతో టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు. కూలీ రేట్ కూడా రాకపోవడంతో కొందరు రైతులు టమాట తెంపాలంటేనే భయపడుతున్నారు.

ఆరుగాలం కష్టించి.. పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు విలవిలలాడుతున్నారు. టమాటా సాగు చేసిన రైతులందరిదీ ఇదే దుస్థితి. ఏ రైతును కదలించినా.. సరైన ధర కల్పించడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.. సాగుచేసిన టమాటా పంట రోడ్డు పాలైంది. కాలం కలిసి రావడంతో కొంత మేరకు ఆశించిన దిగుబడులు వచ్చాయనుకుంటే, ధర తగ్గిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు రైతులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ