Telangana: నేతన్న ఇంటి కన్నీటి చిత్రం.. శవం పెట్టడానికి జాగ కూడా లేకపోయనే
గూడు లేక.. అద్దె ఇంటిలోకి వెళ్ళలేక.. ఓ కుటుంబం రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్‌లో గడిపింది.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స చేయించుకోలేని స్థోమత లేక ఓ నేతన్న కన్నుమూశాడు. భార్య..ముగ్గురు పిల్లలు ఏం చేయాలో తెలువక దిక్కుతోచని స్థితిలో కన్నీరు, మున్నీరుగా విలపించారు. రాత్రంతా జాగారం చేసి.. అంబులెన్సు నుంచి నేరుగా స్మశానవాటికకు తరలించారు.

గూడు లేక.. అద్దె ఇంటిలోకి వెళ్ళలేక.. ఓ కుటుంబం రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్‌లో గడిపింది.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స చేయించుకోలేని స్థోమత లేక ఓ నేతన్న కన్నుమూశాడు. భార్య..ముగ్గురు పిల్లలు ఏం చేయాలో తెలువక దిక్కుతోచని స్థితిలో కన్నీరు, మున్నీరుగా విలపించారు. రాత్రంతా జాగారం చేసి.. అంబులెన్సు నుంచి నేరుగా స్మశానవాటికకు తరలించారు.. ఈ విషాదకర ఘటన కలకలం రేపింది.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో… అద్దె ఇంటికి తీసుకు వెళ్లలేక సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచారు.. మృతుడి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు.
మృతుడు సంతోష్ కు వారి ఐదుగురు అన్నదమ్ములతో కలిసి ఉన్న ఇల్లు శిథిలావస్థలోకి చేరడంతో.. అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.. అయితే.. మృత దేహాన్ని అద్దె ఇంటికి తీసుక వెళ్ళలేకపోయాడు. సొంత ఇల్లు మొత్తం కూలిపోయింది. దీంతో అంబులెన్సు దిక్కుగా మారింది.
వీడియో చూడండి..
సంతోష్ కు క్యాన్సర్ వ్యాధి సోకడంతో పరిస్థితి విషమించి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. దీంతో ఆయన భార్య మృతదేహాన్ని ఆంబులెన్స్ లో తీసుకువచ్చి రాత్రి అంతా రోడ్డుపైనే ఉన్నారు. తెల్లవారుజామున అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అంబులెన్సు నుంచి నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
కొంత మంది ఆర్థిక సహాయం చేయడంతో అంత్యక్రియలు జరిగాయి.. అటు పెద్ద దిక్కు కోల్పోయి.. ఇల్లు లేకుండా.. ధీన స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..