Dasha Dinakarma: పెంచిన మనసు విలవిల.. పెంపుడు కుక్కకు దశదిన కర్మ

కుక్కకు ఉన్న విశ్వాసం.. మనుషుల్లో ఉండదనేది సామెత కాదు నిజం. ఓ ముద్ద అన్నం పెట్టినా.. జీవితాంతం మన ఇంట్లోనే కాచుకుని ఉంటుంది. అందుకే ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లో..

Dasha Dinakarma: పెంచిన మనసు విలవిల.. పెంపుడు కుక్కకు దశదిన కర్మ
Dog Anthayakriyalu
Follow us

|

Updated on: Jan 11, 2022 | 7:11 PM

కుక్కకు ఉన్న విశ్వాసం.. మనుషుల్లో ఉండదనేది సామెత కాదు నిజం. ఓ ముద్ద అన్నం పెట్టినా.. జీవితాంతం మన ఇంట్లోనే కాచుకుని ఉంటుంది. అందుకే ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లో ఓ పెంపుడు కుక్క ఉండడం సాధారణంగా మారింది. లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొనడం చూస్తున్నాం. తాము కంటికి రెప్పలా పెంచుకున్న ఆ బుజ్జి కుక్క చనిపోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేక పోయింది. కన్న వాళ్ళని కూడా సరిగ్గా చూడనీ ఈ రోజుల్లో ఒక కుక్కను మనిషి కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ కుటుంబ సభ్యులు చనిపోతే ఎలా అంతక్రియలు చేస్తారో అలా చేశారు. దానితో గడిపిన క్షణాలను ప్రతిక్షణం వాళ్ళ ఫోన్ లో చిత్రీకరించి కుక్క చనిపోయేంత వరకు ఆత్మీయంగా అభిమానంతో పెంచుకుంది ఆ కుటుంబం.

సిద్దిపేట అర్బన్ మండలం బక్రి చెప్యాల గ్రామనికి చెందిన పురుమాండ్ల వెంకట్ రెడ్డి.. సులోచన దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే ఈ మూగ జీవిని మూడో బిడ్డగా పెంచు కున్నారు. అది పదేళ్ల పాటు వీరి ఇంట్లో జీవించింది.

ప్రణీత్ రెడ్డి అలియాస్ ఫణి అలియాస్ చిన్నోడు ఇది వాళ్ళ ఇంటి కుక్క పేరు.. డిసెంబర్ 29న ఫణి(కుక్క) అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆ దంపతులు కుమిలి పోయారు. వారి స్వగ్రామం అయిన బక్రిచెప్యాలలో దానికి హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు తుది సంస్కారాలు నిర్వహించి నివాళులు అర్పించారు.

అలాగే 3, 5, 9, రోజుల కార్యక్రమాలతో పాటు ఆదివారం దశ దినకర్మ నిర్వహించారు. ఫణి(కుక్క) ఫోటోకి ఫ్రేమ్ కట్టించి పూలతో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టి మూగజీవి ఆత్మకు శాంతి కలగాలని అందరు ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి: Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..

Ration Card: మీకు తెలుసా ఈ విషయం.. రేషన్ కార్డులో మీ పేరు ఉందో.. లేదో.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..