అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు

కూరగాయల ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి... నిన్నమొన్నటి వరకూ కిలోకు నలభై నుండి యాభై రూపాయలు ఉన్న కూరగాయల రేట్లు ఒక్కసారిగా అమాంతం పడిపోయాయి.

  • Rajeev Rayala
  • Publish Date - 3:22 pm, Sun, 11 April 21
అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు
కూరగాయల పంటను మార్కెట్కు తీసుకెళ్తే కిలో ఐదు నుంచి పది రూపాయల లోపే ఉండటంతో కనీసం కూలీ ఖర్చులు, ట్రాన్స్పోర్టు ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు రైతులు. 

కూరగాయల ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి… నిన్నమొన్నటి వరకూ కిలోకు నలభై నుండి యాభై రూపాయలు ఉన్న కూరగాయల రేట్లు ఒక్కసారిగా అమాంతం పడిపోయాయి. దీంతో కూరగాయల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కూరగాయల రైతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో సదానందం అనే రైతు గత ఇరవై రోజుల క్రితం టమోటా ధర పూర్తిగా పాతాళానికి పడిపోవడం తో చేతికొచ్చిన పంటను ట్రాక్టర్ తో పొలంలోనే దున్నేశాడు, సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి సదానందం అనే రైతు తనకున్న మిగతా కూరగాయల పంటను మార్కెట్కు తీసుకెళ్తే కిలో ఐదు నుంచి పది రూపాయల లోపే ఉండటంతో కనీసం కూలీ ఖర్చులు, ట్రాన్స్పోర్టు ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతు సదానందం. కూరగాయలు సాగు చేసే సదానందం రైతు ఒక్కరి పరిస్థితే కాదు, పెద్దపల్లి జిల్లాలోనెే కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉందని, కూరగాయల సాగుపై పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. పెద్దపల్లి మార్కెట్లో బెండకాయ కి పూర్తిగా ధర పడిపోవడంతో వచ్చిన కస్టమర్లకు ఫ్రీగానే పంపిణీ చేశారు రైతులు. అయితే కూరగాయల రేట్లు అమాంతం పడిపోవడానికి కారణం ఎక్కువమంది రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని కూరగాయల రైతులు అంటున్నారు. అయితే సదానందం కూరగాయల సాగును వదిలిపెట్టి చేతులెత్తేశాడు, దీంతో కాయలు చెట్టు మీదనే పండుగా మారిపోతున్నాయి. కూరగాయల సాగులొ నష్టపోయిన రైతులు కూలీలుగా మారే పరిస్థితులు నెలకొన్నాయని కూరగాయలు సాగు చేసిన రైతులు అంటున్నారు. అయితే ఉద్యానవన శాఖ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ధాన్యానికి ఏవిధంగానైతే మద్దతు ధర ఉంటుందో అదే విధంగా కూరగాయల కూడా ధర ప్రకటిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూరగాయల సాగు చేసి నష్టపోయిన రైతుల కూరగాయల పంటలను సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rare Bird: ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అరుదైన పక్షి.. హిమాలయా పర్వతాల్లో కనుగొన్న శాస్త్రవేత్తలు

షూగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..

లూలూ గ్రూప్ అధినేతకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. కుప్పకూలిన హెలికాప్టర్.. చిత్తడి నేలలో దిగడంతో..