Granite Companies-ED: ప్రభుత్వానికి రూ.800 కోట్లకుపైగా ఎగ్గొట్టారు.. గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరపాలని సీబీఐకి ఈడీ లేఖ

తెలంగాణలోని గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరిపించాలని సీబీఐకి లేఖ రాసిన ఈడీ. ప్రభుత్వానికి రూ.800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదన్న అభియోగాలపై విచారణ జరిపించాలంటోంది ఈడీ.

Granite Companies-ED: ప్రభుత్వానికి రూ.800 కోట్లకుపైగా ఎగ్గొట్టారు.. గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరపాలని సీబీఐకి ఈడీ లేఖ
Granite Companies
Follow us

|

Updated on: Jan 06, 2023 | 9:31 AM

తెలంగాణలో గ్రానైట్ కంపెనీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరిపించాలని సీబీఐకి లేఖ రాసింది ఈడీ. శ్వేతా ఏజన్సీ, ఏఎస్‌యూవై షిప్పింగ్, జేఎం బాక్సీ, మైథిలీ ఆధిత్య ట్రాన్స్‌పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పీఎస్‌ఆర్ ఏజెన్సీస్, కేవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్, గాయత్రీ మైన్స్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఈడీ లేఖ రాసింది. దొంగ లెక్కలు, తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టినట్టు ఈడీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి రూ.800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదన్న అభియోగాలపై విచారణ జరిపించాలంటోంది ఈడీ.

చైనా, హాంగ్ కాంగ్ కు చెందిన కంపెనీల పాత్రపై ఆరా తీసింది ఈడీ. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది ఈడీ. రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ శాఖకు ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదులు ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈడీ అధికారులు మరోసారి సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

ఓ న్యాయవాది ఫిర్యాదుతో కదిలిన డొంక..

మైనింగ్‌ పరిమితులు దాటి మరీ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, చెల్లించాల్సిన ఫైన్లను కూడా ఎగ్గొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా అక్రమాలపై ఆరా తీస్తోంది ఈడీ. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ బిజినెస్ చేస్తున్న పలు కంపెనీలు తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జరిమానాలు కట్టడం లేదని ఇదే జిల్లాకు చెందిన అడ్వకేట్ భేతి మహేందర్‌రెడ్డి ఆధారాలతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. దీంతో అసలు కథ మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!