బ్రేకింగ్.. దుబ్బాక ఎమ్మెల్యే కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 57 ఏళ్లు. గత తకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స..

బ్రేకింగ్.. దుబ్బాక ఎమ్మెల్యే కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 57 ఏళ్లు. గత తకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. ఆయన కాలికి ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మళ్లీ నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన 2004,2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 2014,2018లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సోలిపేట రామ లింగారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్‌తోపాటు, టీఆర్ఎస్‌ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Click on your DTH Provider to Add TV9 Telugu