కోడ్ లాంగ్వేజ్‌తో డ్రగ్స్ సరఫరా.. నిందుతుడి అరెస్ట్..

విశాఖలో కలకలం రేపిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ముందడుగేశారు. కీలక నిందితుడు వీర రాఘవ చౌదరి అలియాస్ సోనూను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇతను ఏటూగా ఉన్నాడు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సోనూకు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలంగా విశాఖలో ఈవెంట్లు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు సోను. కొద్దిరోజుల క్రితం విశాఖ బీచ్‌లో రేవ్ పార్టీ పేరుతో రెచ్చిపోయారు కొందరు యువకులు. మద్యం, డ్రగ్స్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:52 am, Sat, 20 April 19
కోడ్ లాంగ్వేజ్‌తో డ్రగ్స్ సరఫరా.. నిందుతుడి అరెస్ట్..

విశాఖలో కలకలం రేపిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ముందడుగేశారు. కీలక నిందితుడు వీర రాఘవ చౌదరి అలియాస్ సోనూను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇతను ఏటూగా ఉన్నాడు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సోనూకు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలంగా విశాఖలో ఈవెంట్లు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు సోను.

కొద్దిరోజుల క్రితం విశాఖ బీచ్‌లో రేవ్ పార్టీ పేరుతో రెచ్చిపోయారు కొందరు యువకులు. మద్యం, డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ నానా హంగామా సృష్టించారు. అయితే.. హద్దుమీరి రెచ్చిపోయిన కేటుగాళ్లకు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. వీకెండ్ జోష్‌లో రేవ్ పార్టీల పేరుతో బీచ్‌ల్లో.. ఫుల్‌గా మందు తాగి హంగామా చేస్తున్న యువతి, యువకులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

కాగా.. వీరంతా కోడ్ లాంగ్వేజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొకైన్‌కు C, MDMA పౌడర్‌కు M, LSD స్ట్రిప్స్ కోసం Lగా కోడ్స్ వాడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా విశాఖకు డ్రగ్స్ వస్తున్నట్లు.. కోడ్ పికోడ్ లాంగ్వేజ్‌లో ఓ వెబ్‌సైట్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అలాగే… సోషల్ మీడియా గ్రూప్స్ కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.