అయ్యా బాబోయ్‌.. రైతు నేస్తంగా మారిన పులి..! అనుకుంటే పొరపడినట్టే.. అసలు సంగతి తెలిస్తే అవాక్కే!!

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Jan 25, 2023 | 10:07 AM

దానిని దూరం నుండి చేసిన జనాలంతా అది పులి అని భ్రమపడుతున్నారు, భయపడుతున్నారు. దగ్గరికి వచ్చి చూస్తే అది కుక్కే కానీ ఒంటిమీద మాత్రం పులిలాగా చారలు ఉన్నాయని తెలిసి అవాక్కవతున్నారు. నవ్వుకుని వెళ్లిపోతున్నారు.

అయ్యా బాబోయ్‌.. రైతు నేస్తంగా మారిన పులి..! అనుకుంటే పొరపడినట్టే.. అసలు సంగతి తెలిస్తే అవాక్కే!!
Dog Dressed As Tiger

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా.. అనేది నానుడి.. ఇదేలా వాడుకలోకి వచ్చిందో తెలియదు గానీ, ఇక్కడ మాత్రం ఒక గ్రామ సింహం పులివేశం కట్టింది. సాధారణంగా కుక్కలు తెలుపు, నలుపు లేదంటే గోధుమ రంగులో ఉంటాయి. తెల్లటి మచ్చలతో కూడిన నల్లటి కుక్కలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. కాని పులి మాదిరిగా ఒంటిపై చారలు, అదే రంగు కలిగి ఉండడం అరుదు. అలాంటిదే ఓ కుక్క జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో హల్‌చల్‌ చేస్తోంది. దానిని దూరం నుండి చేసిన జనాలంతా అది పులి అని భ్రమపడుతున్నారు, భయపడుతున్నారు. దగ్గరికి వచ్చి చూస్తే అది కుక్కే కానీ ఒంటిమీద మాత్రం పులిలాగా చారలు ఉన్నాయని తెలిసి అవాక్కవుతున్నారు. హమ్మయ్యా అంటూ నవ్వుకుని వెళ్లిపోతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు గ్రామ పంచాయతీ బూర్గుగూడెంలో ఓ వ్యక్తి తన శునకానికి రంగులు వేశారు. పులికి ఉండే చారల మాదిరిగా కనిపించడంతో చూడగానే ఒక్కసారిగా భయమేసేలా ఉంది.. వ్యవసాయ భూముల్లో శునకం తిరుగుతుండడంతో కోతులు, పలు జంతువులు పరారవుతున్నాయి.

ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామల రైతులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. పులి వేషం కట్టిన శునకాన్ని చూసి.. తాము కూడా తమ పంటపొలాలను రక్షించుకునేందుకు వెంటనే ఓ శునకాన్ని పెంచుకుంటామని చెబుతున్నారు. ఐడియా బాగుందంటూ ఆ రైతును ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu