Traffic Challan: పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌కు భారీ స్పందన.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..

Traffic Challan: రోడ్డు నిబంధనలను అతిక్రమించి జరిమానాలు కలిగి ఉన్న వారికి తెలంగాణలో రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ఈ రాయితీలు అందుబాటులో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు...

Traffic Challan: పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌కు భారీ స్పందన.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..
Traffic Challan
Follow us

|

Updated on: Mar 04, 2022 | 6:45 AM

Traffic Challan: రోడ్డు నిబంధనలను అతిక్రమించి జరిమానాలు కలిగి ఉన్న వారికి తెలంగాణలో రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ఈ రాయితీలు అందుబాటులో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించిన ఈ రాయితీలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఈ విధానం ప్రారంభించిన తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 39 కోట్లు వసూలు అయ్యాయని తాజాగా అధికారులు తెలిపారు. మార్చి 3వ తేదీ వరకు ఈ మొత్తం వసూలు అయ్యింది. ట్రాఫిక్‌ ఈ చలాన్‌ వెబ్‌సైట్‌లో డిస్కౌంట్‌తో జరిమానా చెల్లించే విధంగా అధికారులు అవకాశం కల్పించారు. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున వెబ్‌సైట్‌కు పోటేత్తుతున్నారు. ఒక సెకనుకు గరిష్టంగా 45 వేల హిట్స్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

నిమిషానికి 700 చలానాల చెల్లింపులు జరిగే వీలు ఉంది.. దీనిని వెయ్యికి పెంచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ వెసులు అందుబాటులోకి వచ్చిన మార్చి 1న 8 లక్షల మంది, రెండో రోజున 15 లక్షల మంది, మూడో రోజున 16 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ డిస్కౌంట్‌ విధానం కేవలం మార్చి నెల వరకు మాత్రమే పరిమితమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లో పొడగించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎలాగో రాయితీలు ఇస్తారుకదా అన్న భావనతో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Also Read: TISS Mumbai Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. టిస్‌ ముంబాయిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..అర్హతలివే!

Luxury Dogs video: ఈ వీడియో చూశాక ఎవరినీ కుక్కతో పోల్చరు.. ఈ వీడియో చూస్తే ఒప్పుకోక తప్పదు.. వైరల్ వీడియో..

Viral Video: వీధి కుక్కల మధ్య గ్యాంగ్ వార్.. బాహుబలి యుద్ధ సన్నివేశాన్నే మించిపోయింది..