Telangana: ‘ప్రమోషన్ కోసమా.. ఎమ్మెల్యే టికెట్ కోసమా..’ సీఎం కాళ్లు మొక్కిన హెల్త్ డైరెక్టర్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం కేసీఆర్ కాళ్లను రెండుసార్లు మొక్కారు. ఆయన కళ్లల్లో పడేందుకు తెగ ప్రయత్నించారు.

Telangana: 'ప్రమోషన్ కోసమా.. ఎమ్మెల్యే టికెట్ కోసమా..' సీఎం కాళ్లు మొక్కిన హెల్త్ డైరెక్టర్‌పై తీవ్ర విమర్శలు
Director of Public Health touches KCR's feet
Follow us

|

Updated on: Nov 16, 2022 | 4:08 PM

హెల్త్​ డైరెక్టర్ హోదాలో ఉండి  స్వయం ప్రకటిత దేవత వద్ద క్షుద్ర పూజలు.. బతుకమ్మ వేడుకల్లో డీజే టిల్లు సాంగ్‌కి తీన్మార్ స్టెప్పులు.. తాజాగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కుడు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంగా మారింది. మరీ బానిస మాదిరి ఒకటికి, రెండు ఆయన వ్యవహారించిన తీరు నిజంగా జుగుప్స కలిగించిందని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇలాంటి వ్యక్తులు బ్యూరోక్రసి పరువు తీస్తున్నారు అంటూ మాజీ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ మెప్పు పొందేందుకు శ్రీనివాస్ ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన మనసు రాజకీయాల వైపు మళ్లిందట. ఖద్దరు చొక్కా వేయాలని బాగా ముచ్చట పడుతున్నారనట. అందుకోసం ఓ ఏరియాను సెలెక్ట్ చేసుకుని గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారట. శ్రీనివాస్ కొత్తగూడెం TRS టికెట్ ఆశిస్తున్నారని మాజీ IAS అధికారి ఆకునూరి మురళి బాహాటంగానే విమర్శించారు. ఈ మేరకు మురళి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

“కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెంలో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు” అని ఆకునూరి మురళి రాసుకొచ్చారు.

శ్రీనివాస్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

ఈ వీడియో చూసిన నెటిజన్లు శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. మరీ ఇంత దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్ కోసమా లేక ఎమ్మెల్యే టికెట్ కోసమా.. ఇంత బానిసత్వం అని కామెంట్స్ చేస్తున్నారు. నేతలకు ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడే ఇలాంటి అధికారులు.. వారికి ఏ విధంగా ఉపయోగపడని పేద ప్రజలను ఏం పట్టించుకుంటారని ట్వీట్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి