Diesel chori :ఆగివున్న లారీలో డీజిల్ ఎత్తుకుపోయారు.. లబోదిబోమంటున్న డ్రైవర్‌

బంగారం,వెండి ఆభరణాల చోరీ కోసం కన్నాలు వేయడం చూశాం. ట్యాక్సులు తప్పించుకొనేందుకు విలువ వస్తువులు, బంగారం వంటి వాటి అక్రమ రవాణా గురించి విన్నాం. కానీ ఇప్పుడు

Diesel chori :ఆగివున్న లారీలో డీజిల్ ఎత్తుకుపోయారు.. లబోదిబోమంటున్న డ్రైవర్‌
Diesel Chori
Follow us

|

Updated on: May 20, 2022 | 9:54 PM

బంగారం,వెండి ఆభరణాల చోరీ కోసం కన్నాలు వేయడం చూశాం. ట్యాక్సులు తప్పించుకొనేందుకు విలువ వస్తువులు, బంగారం వంటి వాటి అక్రమ రవాణా గురించి విన్నాం. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలతో డీజిల్‌ బంగారంలా మారింది. రష్యా యుద్ధ కారణంగా చమురు ధరలు బాగా పెరిగాయి. ఈ ఇంధనం ధర రూ.వంద దాటడంతో ఇప్పుడు కొత్తగా డీజిల్‌ దొంగలు పుట్టుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్‌ని చోరీ చెయ్యడం సరైన దొంగతనంగా భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు హైవేలపై పెట్రో డీజిల్‌ చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. తాజగా జయశంకర్‌ భూపాలపల్లిలోనూ ఇదే తరహా చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే…

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డీజిల్‌ దొంగతనంతో స్థానికులు వివ్వేరపోతున్నారు. గణపురం మండలం కర్కపల్లి గ్రామంలో 353 జాతీయ రహదారిపై గురువారం రాత్రి లారీ పార్కింగ్ చేసి డ్రైవర్ సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు..ఇదే అదునుగా భావించిన దొంగలు లారీ లోని 220 లీటర్ల డీజిల్ దొంగిలించారు. లారీ లోని 220 లీటర్ల డీజిల్ ను దొంగలించారన్న విషయం తెలుసుకున్న లారీ యజమాని వెంటనే స్థానికులకు విషయం వివరించాడు. తొలిసారిగా విన్న వింత చోరీతో గ్రామస్తులు అవాక్కయ్యారు. డీజిల్ విలువ దాదాపు 23వేలు ఉంటుందని లారీ యజమాని చెప్తున్నాడు..ఈ ఘటన పై యజమాని జెట్టి.నవీన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..ఆగి ఉన్న లారీ లో డీజిల్ దొంగతనం చేయడంతో ప్రజలు ఆశ్చర్య పోతున్నారు..ధరలు పెరగడం తో డీజిల్ ను దొంలించారేమో అని అనుకుంటున్నారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.