Kothagudem: కన్నీళ్ళను దిగమింగుతూ.. కసిదీరా ఆడి.. స్వర్ణం నెగ్గిన FRO శ్రీనివాసరావు కుమార్తె

గుత్తికోయల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుమార్తె కృతిక అథ్లెటిక్స్‌లో సత్తా చాటింది. తండ్రి మరణించిన నాలుగో రోజునే క్రీడా పోటీల్లో పాల్గొంది.

Kothagudem: కన్నీళ్ళను దిగమింగుతూ.. కసిదీరా ఆడి.. స్వర్ణం నెగ్గిన FRO శ్రీనివాసరావు కుమార్తె
Fro Srinivasa Rao Daughter
Follow us

|

Updated on: Nov 26, 2022 | 2:48 PM

నాన్నంటే ఓ విశ్వాసం…నాన్నంటే ఓ భరోసా…నాన్న పిలుపంటే గెలుపునిచ్చే ఓ స్ఫూర్తి వచనం. కానీ అలాంటి నాన్నే ఇక లేడు…తిరిగి రానే రాడు. అది అర్థమయ్యీ అవ్వని వయస్సు. గుత్తికోయల దాడిలో మృతిచెందిన నాన్న మాటల్నే స్ఫూర్తిగా భావించింది ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావు కూతురు కృతిక. ఎలాగైనా పతకం కొట్టాలన్న నాన్న మాటలను మదిలో నిలుపుకొని…కన్నీళ్ళను దిగమింగుకొని….కసిదీరా ఆడింది. విజేతగా నిలిచింది. కొత్తగూడెంలో జరిగిన క్రీడాపోటీల్లో…అండర్‌ -10 విభాగంలో లాంగ్‌ జంప్‌లో స్వర్ణం సాధించి..ఈ స్వర్ణం నాన్నకే అంకితం అంటోంది… శ్రీనివాసరావు ముద్దుల కూతురు కృతిక.

అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావు కూతురు కృతిక శెభాష్‌ అనిపించుకుంటోంది. నాన్న కలని నిజం చేయాలనుకుంది. నాన్నదూరమైనా…నాన్న స్ఫూర్తిని అందిపుచ్చుకుంది. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుంది చిన్నారి కృతిక. గెలిచితీరాలన్న నాన్న మాటకు కట్టుబడింది. కొత్తగూడెంలో జరిగిన క్రీడాపోటీల్లో సత్తా చాటింది జిల్లాలోనే కాదు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.

ఫారెస్టు రేంజర్ శ్రీనివాసరావు ఈ నెల 22 న గుత్తికోయ ల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. కుటుంబ, సభ్యులే కాదు, ఫారెస్టు అధికారులు, స్థానికులు ఈ దారుణ ఘటన తో కన్నీళ్ళు పెట్టుకున్నారు.. ఒకవైపు తండ్రి మరణించిన విషాదం నుంచి బయట పడక ముందే ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తోంది ఆయన కుమార్తె కృతిక.  గుండెలు పిండేసే వేదన తరుముకొస్తోంది. గ్రౌండ్ లో అడుగుపెడితే నాన్న గుర్తొస్తున్నాడు….ఆటలే కాదు…అందర్నీ వదిలేసి,… దూరంగా పారిపోవాలనిపిస్తోంది. పరుగు పరుగున వచ్చి…నాన్న గుండెలమీద వాలిపోవాలనిపిస్తోంది. వద్దంటే వినడానికి నాన్న లేడు. కావాల్సిందల్లా ఇవ్వడానికీ నాన్న లేడు. కానీ కృతిక దగ్గరున్నది ఒకే ఒక్కటి నాన్నకిచ్చిన మాట. తను గెలవాలన్న ఆయన కోరికని తీర్చాల్సిన బాధ్యత. అందుకే కసిదీరా ఉరికింది. మైదానంలో తన తడాఖా చూపించింది.

క్రీడాస్ఫూర్తినిచ్చింది మాత్రం పెదనాన్న. ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తోన్న కృతిక పెదనాన్న కృష్ణయ్య ప్రోత్సహం కృతికలో క్రీడాసక్తిని పెంచింది. తండ్రే స్వయంగా గ్రౌండ్‌ కి తీసుకెళ్ళి ఆడించేవాడు. అలాంటి తండ్రి ఈ రోజులేడు.  తనని గొప్ప అథ్లెట్‌గా చూడాలన్నది నాన్న శ్రీనివాసరావు కోరిక. కొత్తగూడెంలో జరిగిన క్రీడాపోటీల్లో సత్తా చాటాలని చెప్పిందీ కృతిక తండ్రి ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావే. అందుకే తండ్రి మరణంతో ఆవహించిన నిస్సత్తువను తొలగించుకొని సత్తువకొద్దీ పరిగెత్తింది. కసిదీరా ఆడింది.

తండ్రి మరణించిన నాలుగో రోజునే క్రీడాపోటీల్లో పాల్గొన్న చిన్నారి కృతిక అండర్‌ -10 విభాగంలో లాంగ్‌ జంప్‌లో స్వర్ణం సాధించడం అంతటి విషాదంలోనూ ఓ చిన్న ఆనందాన్నిచ్చింది ఆ కుటుంబానికి. అంతేకాదు 100 మీటర్ల రన్నింగ్ లో రజత పతకాన్ని సైతం గెలుచుకుంది కృతిక. దీంతో పాటు డిసెంబర్ లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై…నాన్న పోరాట పటిమను కొనసాగిస్తోంది కృతిక. భవిష్యత్తులో మంచి అథ్లెట్‌గా నిలవాలని కలలుగన్న తండ్రి ఆశయం నెరవేర్చాలని కృతనిశ్చయంతో ఉంది కృతిక.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!