Dalit Bandhu: బంపరాఫర్.. దళిత బంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

తెలంగాణలోకి కేసీఆర్ సర్కారు మరో బంపరాఫర్ ప్రకటించింది. దళితుల అభ్యున్నతికి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని తాజాగా మరో నాలుగు మండలాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Dalit Bandhu: బంపరాఫర్.. దళిత బంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం
Cm Kcr 2
Follow us

|

Updated on: Sep 01, 2021 | 12:24 PM

Dalit Bandhu:  తెలంగాణలోకి కేసీఆర్ సర్కారు మరో బంపరాఫర్ ప్రకటించింది. దళితుల అభ్యున్నతికి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని తాజాగా మరో నాలుగు మండలాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ పథకాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఫలితంగా ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై హైద‌రాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. అనంతరం ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది.

దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

దళితుల అభివృద్దికి గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధులో భాగంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం కార్యచరణ కూడా సిద్దం చేశారు. ఇప్పటికే హుజూరాబాద్ లో డబ్బు పంపిణీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఈ పథకాన్ని క్రమక్రమంగా మిగతా ప్రాంతాలకు కూడా పొడిగిస్తున్నారు.

Read also: Crime News: పెళ్లి జరిగిన పది మాసాలకే మహిళ ఆత్మహత్య.. వీడియో కాల్‌లో భర్త చూస్తుండగానే..