Co-WIN Registration: తెలంగాణలో సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ పేరును ఇలా నమోదు చేయించుకోండి..

Covid Vaccination: తెలంగాణలో ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో...

Co-WIN Registration: తెలంగాణలో సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ పేరును ఇలా నమోదు చేయించుకోండి..
Follow us

|

Updated on: Mar 01, 2021 | 10:31 AM

Corona vaccination drive: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమవారం నుంచి తెలంగాణలో మొదలవుతోంది. ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.

తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు. హైదరాబాద్‌లో 12, ఇతర జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ సంఖ్య ద్వారా cowin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కొవిడ్‌ టీకా తీసుకోవచ్చని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేసినా తర్వాతే వ్యాక్సిన్‌ ఇస్తారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.

అందరూ మొదటి రోజే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు తొందరపడవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్‌చైర్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేస్తారు. ఇందుకు ఒక్క డోస్‌కు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ధర రూ.150 కాగా.. సర్వీస్ చార్జీ రూ.100. ఇంతకంటే ఎవరూ ఎక్కువగా వసూలు చేయకూడదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే..

Youtube Star Shanmukh Jaswanth: డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైన యూట్యూబ్ స్టార్ షణ్ముక్.. కేసు నమోదు

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?

అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?