నేను ఏ రోజూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీపీసీసీ వ్యవహారంలో ఎవరికి వారి పైరవీలు జోరందుకున్నాయి. టీపీసీసీ కట్టబెట్టే అంశంలో పలువురి పేర్లు వినిపిస్తుండటం...

నేను ఏ రోజూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Dec 25, 2020 | 1:13 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీపీసీసీ వ్యవహారంలో ఎవరికి వారి పైరవీలు జోరందుకున్నాయి. టీపీసీసీ కట్టబెట్టే అంశంలో పలువురి పేర్లు వినిపిస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్ సీనియర్ నాయకుడి.. నేను ఏ రోజూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. 2018 నుంచి సోనియాగాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అలాగే రాహుల్ గాంధీని కూడా కలవనివ్వలేదు. మధ్యలో ఉన్నవాళ్లునాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నాయకులకు కాంగ్రెస్ అన్యాయం చేసేలా కనిపిస్తోందని ఆరోపించారు. సీనియర్ నాయకులను విస్మరిస్తున్నారని, సీనియర్ నేతలంతా కూడా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ వాదికి టీపీసీసీ పదవి ఇస్తే నేను పని చేయనంటూ వీహెచ్ స్పష్టం చేశారు. మాణిక్యం ఠాగూర్ ప్యాకేజీకి అమ్ముడుపోయాడని వ్యాఖ్యానించారు. తప్పుడు నివేదికలు ఇచ్చి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని వీహెచ్ మండిపడ్డారు.

ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాల‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు.. అధికారికంగా ఆమోదించిన హైక‌మాండ్‌