MLA Jagga Reddy: కాంగ్రెస్‌ లేకుండా చేయాలన్నదే బీజేపీ-టీఆర్ఎస్ వ్యూహం.. చర్చలో లేకుండా చేసేందుకే.. ఈడీ, ఐటీ, సిట్‌ పేరుతో డ్రామాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ లేకుండా చేయాలన్నదే బీజేపీ-టీఆర్ఎస్ వ్యూహమని ఆరోపించారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ను చర్చలో లేకుండా చేసేందుకే ఈడీ, ఐటీ, సిట్‌ అంటూ డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు..! ఈ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు జగ్గారెడ్డి.

MLA Jagga Reddy: కాంగ్రెస్‌ లేకుండా చేయాలన్నదే బీజేపీ-టీఆర్ఎస్  వ్యూహం.. చర్చలో లేకుండా చేసేందుకే.. ఈడీ, ఐటీ, సిట్‌ పేరుతో  డ్రామాలు..
Congress MLA Jagga Reddy
Follow us

|

Updated on: Nov 24, 2022 | 4:32 PM

తన లుక్కు మార్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. తాజాగా మరోసారి  టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు దౌర్భాగ్య పరిపాలన దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రజల కష్టాలు గాలికి వదిలేశారని.. రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయని, నల్లధనం తెస్తానన్న ప్రధాని మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. మాటల గారడి.. మత చిచ్చు.. ఇదే పని అని విమర్శించారు. ప్రజలు ఎందుకు ఇవన్నీ ఆలోచన చేయడం లేదో అర్థం కావడం లేదు. అమ్మవారి పెరు చెప్పగానే సిటీలో 45 సీట్లు వచ్చాయి. ఆ 45 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని ఆలోచన కూడా ప్రజలు చేయడం లేదు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం 57 ఏండ్ల వారికి పెన్షన్ ఇస్తానని ఇంత వరకు ఇవ్వలేదని.. ఉద్యోగాలు లేవు,  ప్రజలు కూడా ఇవేం పట్టించుకోవడం లేదన్నారు జగ్గారెడ్డి.

బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, కేసీఆర్ మధ్య నువ్వు గిచ్చినట్టు చెయ్.. నేను కొరికినట్టు చెయ్ అన్నట్టు ఉందని ఎద్దేవ చేశారు. ఇద్దరి మధ్య అవగాహన తోనే రాజకీయం నడుస్తుందన్నారు. రెండు పార్టీల మధ్య పంచాయతీలో కాంగ్రెస్‌ని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. మా బలహీనతలు అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయ ఎత్తుగడ అవలంబిస్తుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఉండొద్దని కుట్ర.. 

ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లతో బీజేపీ దాడులు చేస్తోందని.. ఈడీ, ఐటీ అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ రెండు డిపార్ట్మెంట్లకు బండి సంజయ్ చీఫ్ అయ్యారా..? అనేది అర్థం కావడం లేదన్నారు. మల్లారెడ్డి ఇప్పుడు సంపాదించిండా పైసలు.. టీడీపీలో ఉన్నప్పటి నుంచి సంపాదిస్తున్నాడు. ఈ ఎనిమిది ఏండ్లలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. 8 ఏండ్ల నుంచి ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నించారు.

దేవుళ్ళ కాలంలో కూడా క్యాసినో క్లబ్బు లు ఉన్నాయన్నారు. గోవాలో క్యాసినో ఫ్రీ, అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే  కదా.. అక్కడ అడే వాళ్ళను.. తెలంగాణకు వచ్చి దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. గోవాలో ఆడించేది మీరు.. ఇక్కడ దాడులు చేసేది మీరే.. అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు.

మా కొట్లాట లోక కల్యాణం కోసం..

మా కొట్లాట లోక కల్యాణం కోసం, బీజేపీ..trs కొట్లాట లోక వినాశనం కోసం. మేము అంతర్గత పంచాయతీ లోక కల్యాణం కోసం,  బీజేపీ.. ఈడీ, ఐటీని వాడుతుంది. కేసీఆర్ ఏసీబీని వాడుతున్నారు. ఇన్ కమ్ టాక్స్ అధికారులపై కేసీఆర్ ఏసీబీ దాడులు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.

డబ్బులు ఇస్తే పదవులు రావు..

డబ్బులు ఇస్తే కాంగ్రెస్ లో పదవులు వస్తాయని రాహుల్ గాంధీపై మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడటం తప్పన్నారు. కేసీ వేణుగోపాల్, ఠాగూర్‌ని తిట్టినా తప్పే అని అన్నారు. మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యారు. ఆయన కూడా డబ్బులు ఇచ్చి సీఎం అయ్యాడా.. అని ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?