VH: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కాంగ్రెస్ నేత వీహెచ్ ఫిర్యాదు..

V Hanumantha Rao - Cyber Police: సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

VH: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కాంగ్రెస్ నేత వీహెచ్ ఫిర్యాదు..
Follow us

|

Updated on: Feb 21, 2022 | 2:01 PM

V Hanumantha Rao – Cyber Police: సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను (VH), జగ్గారెడ్డిని టార్గెట్‌గా చేస్తూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) తో జగ్గారెడ్డి (Jagga Reddy), తాను ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి కొందరు (Social Media) లో పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా కావాలనే చేసే అసత్య ప్రచారమని.. తన పొలిటికల్ కెరీర్‌ను దెబ్బతీసేందుకే ఇదంతా జరుగుతుందని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నానని.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. సోషల్ మీడియాతోపాటు.. యూట్యూబ్‌లో జరుగుతున్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ కోరారు.

ఇదిలాఉంటే.. తాను కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు తీసుకోవడం లేదంటూ వీహెచ్.. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌.. వీహెచ్ మధ్య మాటల యద్ధం జరిగింది. తాను, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్యలో కేసీఆర్ ఉన్న ఫొటోను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Vh Complains To Police

Vh Complains To Police

ఇదిలాఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆసంతృప్తితో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇటీవల పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఏకంగా ఇంటికి వెళ్లి జగ్గారెడ్డితో మాట్లాడారు. అనంతరం రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మార్ఫింగ్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

Also Read:

Jagga Reddy: అన్నా.. కాంగ్రెస్ వీడొద్దు.. వీహెచ్ ఎదుట జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన పీసీసీ నేత

Bandla Ganesh: భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.