CM KCR: నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు

ప్రగతి భవన్ వేదికగా ఇవాళ కీలక సమావేశం జరగనుంది. తన మంత్రివర్గంలోని మంత్రులతో పాటుగా 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు.

CM KCR: నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు
Telangana CM KCR
Follow us

|

Updated on: Oct 02, 2022 | 12:10 PM

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇవాళ ప్రగతిభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉదయం గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. దసరా రోజున చేయబోయే ప్రకటనపై పార్టీ నేతలతో చర్చించనున్నట్లు సమచారం. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ సన్నద్ధమవుతున్నారు. విజయ దశమి నాడు జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారు. అందులో భాగంగా, దసర రోజున పార్టీ కార్యవర్గ సమావేశం- పార్టీ శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి.

అయితే ఈ సమావేశంలో జాతీయ పార్టీకి అనుకూలంగా తీర్మానం చేయనున్నట్లుగా సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు. భారత రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. భారత వికాస సమితి పేరు ఖరారు చేసినట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచరం సాగుతోంది.

తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. దీని పైన ఈ రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. తొలిసారి ఈ నిర్ణయాన్ని పార్టీలోని కీలక నేతలందరికీ ఆదివారం జరిగే సమావేశంలో వివరించనున్నారు.అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక సభ్యుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అయితే జాతీయ పార్టీ ఏర్పాటు, ప్రకటన కూడా సెంటిమెంట్‌గా కరీంనగర్‌ కేంద్రంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. మొదటి బహిరంగ సభను కూడా కరీంనగర్‌లోనే  ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!