CM KCR: రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ కీలక మంతనాలు.. ఎటూ తేల్చని గులాబీ పార్టీ..

యశ్వంత్ సిన్హా విపక్షాల ఉమ్మడి అభ్యర్థే గానీ.. ఆయనకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందాలేదా అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. శరద్‌పవార్ మాత్రం టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుంది చెప్పారుగానీ.. టీఆర్‌ఎస్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

CM KCR: రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ కీలక మంతనాలు.. ఎటూ తేల్చని గులాబీ పార్టీ..
Telangana CM KCR
Follow us

|

Updated on: Jun 21, 2022 | 5:25 PM

విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా కన్‌ఫాం. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్‌ రమేష్‌ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఓకే అయ్యింది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక‌ యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్‌ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు జైరాం రమేష్ ప్రకటించారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు జైరాం రమేష్. అయితే ఇదే అంశంపై మరికొన్ని పార్టీలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదిలావుంటే.. ప్రగతి భవన్ లో పలువురు టిఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంతనాలు జరుపుతున్నారు. బీజేపీ యేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలావుంటే.. దేశానికి కొత్తగా కాబోయే ప్రథమపౌరుడి ఎన్నికపై అటు బీజేపీ, ఇటు విపక్షాలు మంత్రాంగాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం తర్వాత రాజ్‌నాథ్‌, అమిత్‌షా, జేపీనడ్డా మంతనాలు నడిచాయి. ఆ తర్వాతే ఛత్తీస్‌ఘడ్‌ అనసూయ ఉయికే పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ జాతీయ బీజేపీ మాత్రం అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇటు యశ్వంత్ సిన్హా విపక్షాల ఉమ్మడి అభ్యర్థే గానీ.. ఆయనకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందాలేదా అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. శరద్‌పవార్ మాత్రం టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుంది చెప్పారుగానీ.. టీఆర్‌ఎస్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..