CM KCR: మోడీ అహంకారమే ఆయనకు శత్రువు.. మునుగోడు ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు..

మూడు తోకలు కూడా లేని పార్టీలు.. ఏక్ నాథ్ సిండేలను తీసుకొస్తాంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటే వేస్తే.. అది వ్యర్ధమైనట్టే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

CM KCR: మోడీ అహంకారమే ఆయనకు శత్రువు.. మునుగోడు ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
Modi And Kcr
Follow us

|

Updated on: Aug 20, 2022 | 6:13 PM

CM KCR on PM Modi: మునుగోడు వేదికగా సీఎం కేసీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఉప ఎన్నిక రాష్ట్రానికి బతుకుదెరువు లాంటిదని గులాబీ బాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు ఏకమై.. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏడాదిలో ఎన్నికలు వస్తుండగా.. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చింది? గోల్‌మాల్‌ బైపోల్‌ అంటూ విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ నిలదీశారు. మునుగోడు ప్రజాదీవెన సభ సాక్షిగా ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చలేదో చెప్పాలంటూ అమిత్ షా ను డిమాండ్ చేశారు కేసీఆర్.

మునుగోడులో వచ్చేది ఉప ఎన్నిక మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల బతుకు దెరువు ఎన్నిక అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్. దీని వెనుక చాలా మతలబు ఉందంటూ వివరించారు. మోదీ అహంకారమే ఆయనకు శత్రువన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రభుత్వాలను కూల గొడుతున్నారని మండిపడ్డారు. ఈడీ బోడీలకు భయపడేదే లేదన్నారు సీఎం కేసీఆర్. అలాంటి వాటికి దొంగలు భయపడతారు.. తాము కాదంటూ పేర్కొన్నారు.

మూడు తోకలు కూడా లేని పార్టీలు.. ఏక్ నాథ్ సిండేలను తీసుకొస్తాంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటే వేస్తే.. అది వ్యర్ధమైనట్టే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏ ప్రధాన మంత్రి టైమ్‌లో లేనంత దారుణంగా ఇప్పుడు రూపాయి విలువ పడిపోయిందన్నారు. అందరం కలిసి బీజేపీకి మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు ఒక్క కేసీఆర్ అయి.. బీజేపీ మీద పోరాటం చేయాలన్నారు. మత విద్వేశాలను రెచ్చగొడుతున్న బీజేపీని తరిమికొట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం ఏమి అభివృద్ధి సాధించిందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారని ఫైరయ్యారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న తెలంగాణ.. కరెంట్ కూడా కొనకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్.. నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా తీర్చిదిద్దామని తెలిపారు. భవిష్యత్తులో కూడా సీపీఐ, సీపీఎంతో పనిచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా.. మునుగోడు అభ్యర్థి ప్రకటనపై మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..