CM KCR: దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం కారణంగా ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందని.. అంతర్జాతీయ గణంకాలే ఇందుకు నిదర్శమని ఆయన మండిపడ్డారు. గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM KCR: దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
K. Chandrashekar Rao
Follow us

|

Updated on: Nov 03, 2022 | 9:07 PM

బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేంద్రం కారణంగా ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందని.. అంతర్జాతీయ గణంకాలే ఇందుకు నిదర్శమని ఆయన మండిపడ్డారు. గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారమైన మనసుతో, దుఃఖంతో తొలిసారి ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నా. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది. ఇండియా.. ఆకలి రాజ్యంగా మారుతుంది.. ఇది నేను చెప్పే మాట కాదు.. అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్న మాటలు. ఏ వ్యవస్థను బీజేపీ లెక్కచేయడం లేదు. ఇంత దిగజారడం కరెక్ట్ కాదు. ఇక తెలంగాణలో జరిగిన పరిణామాలపై సమగ్ర వివరాలతో.. దేశంలోని ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపాం. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఫాం హౌస్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర వివరాలు, 60 నిమిషాల వీడియో తెలంగాణ హైకోర్టు సహా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపాం. పార్టీ మారితే వందకోట్లు ఇస్తామన్నారని.. వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని హామీనిచ్చారన్నారు. రామచంద్ర భారతి.. రోహిత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది’

‘ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టాం.. మరికొన్నింటిని పడగొడతాం’ అంటూ ఈ ముఠాలో 24 మంది ఉన్నారు.. ఇది పెద్ద క్రైం.. వారికి ఆధార్ కార్డులతో సహా అన్ని ఉన్నాయిజ ఒక్కొక్కరికీ మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి.. అవన్నీ బట్టబయలయ్యాయి. ఇందులో తుషార్ అనే వ్యక్తి కేంద్ర హోంమంత్రికి సన్నిహితుడు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. దేన్నాయినా గంభీరంగా స్వీకరిచాలి. కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతి నన్ను కలిసినట్టు దుష్ప్రచారం చేశారు. నాపై విచ్చల విడిగా అసత్య ప్రచారాలు చేశారు. పోలింగ్‌ కంటే ముందు మాట్లాడితే మునుగోడులో లబ్ధికోసమేనని ప్రచారం చేస్తారని ఇప్పటి వరకు ఆగా’ అని కేసీఆర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..