CM KCR: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. మంత్రులు, ఎంపీలతో అత్యవసర భేటీ.. 

CM KCR review on Paddy Procurement: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో

CM KCR: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. మంత్రులు, ఎంపీలతో అత్యవసర భేటీ.. 
Cm Kcr
CM KCR review on Paddy Procurement: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు. దీంతోపాటు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. కాగా.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో వరి కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని.. ఐదు రోజులుగా పార్లమెంట్‌ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న పార్లమెంట్‌ సమావేశంలో కేంద్రం స్పందించిన తీరుపై.. ఈ రోజు సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో ఈ విషయంపై ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఇటీవలనే ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అయితే.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు లోక్‌సభలో పలు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. అయితే.. ధాన్యం కొనుగోలు విషయంపై నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ఎంపీలకు సూచనలు చేయనున్నారని తెలుస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu