CM KCR Press Meet: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు సహా.. అన్ని రాష్ట్రాల న్యాయమూర్తులను చేతులు జోడిండి అడుగుతున్నా.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సీఎం కేసీఆర్ కోరారు. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. ఇంత దుర్మాంగం ఎప్పుడూ లేదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.

CM KCR Press Meet: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
CM KCR Press Meet
Follow us

|

Updated on: Nov 03, 2022 | 9:51 PM

సుప్రీంకోర్టు సహా.. అన్ని రాష్ట్రాల న్యాయమూర్తులను చేతులు జోడిండి అడుగుతున్నా.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సీఎం కేసీఆర్ కోరారు. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. ఇంత దుర్మాంగం ఎప్పుడూ లేదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతలే ఉన్నారని.. ఆధారాలతో బయటపెట్టారు. ప్రధాని మోడీ నుంచి.. హోమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్లను నిందితులు చాలాసార్లు ప్రస్తావించారని.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ మేరకు 60 నిమిషాల వీడియోను సైతం విడుదల చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ న్యాయమూర్తులను కోరారు. ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టాం.. మరికొన్నింటిని పడగొడతాం అంటూ పేర్కొన్నారని.. ఈ ముఠాలో 24 మంది ఉన్నారని తెలిపారు. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూలగొట్టేందుకు కుట్ర చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

రామచంద్ర భారతి.. రోహిత్ రెడ్డికి ఫోన్ చేశారని.. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చిందని కేసీఆర్ తెలిపారు. తుషార్ అనే వ్యక్తి హోంమంత్రికి సన్నిహితుడని.. అతను ఫోన్ లో మాట్లాడారని తెలిపారు. ఒక్కొక్కరికీ మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి.. అవన్నీ బట్టబయలు అయ్యాయని తెలిపారు. రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ప్రభుత్వం నడుస్తుందని.. న్యాయవ్యవస్థ దానిని కాపాడాలని కోరారు. పార్టీ మారితే వందకోట్లు ఇస్తామన్నారని.. వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని హామీనిచ్చారని.. రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ప్రభుత్వం ఉందని, కాపాడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు ప్రయత్నించారని.. వారికి ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వీటన్నింటిపై లెక్కలు తేల్చాలని ఆనాడే ఆప్ ఈడీని కోరిందన్నారు.

ఈవీఎంలు ఉన్నంతకాలం బీజేపీకి ఢోకా లేదని చెప్పారు. దేశంలో అనారోగ్యరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ముఠాను ఆపరేట్ చేస్తున్నది.. బీఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్ షా అని ముగ్గురూ స్పష్టంగా చెప్పారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా ఉండదని.. మోడీతో సఖ్యత లేకపోతే ఈడీ వస్తుందని చెబుతున్నారని దారుణమని కేసీఆర్ తెలిపారు.

అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడితే తాము పార్టీలకతీతంగా పోరాడమని.. దీని వెనుకున్న విషయాలన్నింటిపై చర్చ జరగాలని సీఎం కేసీఆర్ కోరారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో అన్ని చెప్పారు. అమిత్ షా పేరు 20 సార్లు ప్రస్తావించారు అని కేసీఆర్ తెలిపారు. చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ అన్ని చేస్తామని చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు.

దేశం ఎప్పుడు ప్రమాదంలో పడిన ఆదుకునేది న్యాయవ్యవస్థే.. కావున చేతులు జోడించి వేడుకుంటున్నా కాపాడండి అంటూ సీఎం కేసీఆర్ కోరారు.. నిందితులకు సంబంధించి 2016 నుంచి కాల్ డేటా సేకరించామని.. 70 వేల పేజీల సమాచారం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఈ ముఠా నాయకుడు ఎవరో బయటకు తేలాలి అంటూ సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీని కూడా సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రెండు సార్లు ప్రధాని అయ్యారు. ఇంతకంటే ఇంకేం కావాలంటూ ప్రశ్నించారు. తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు లెటర్లు ఇస్తేనే చేర్చుకున్నామని.. రాజ్యాంగబద్ధంగా చేర్చుకున్నామని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ మినిట్‌ టు మినిట్‌.. పాయింట్‌ టు పాయింట్‌ అంశాలు దీనిలో మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన వీడియోలో కూడా వీక్షించవచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.