సాగర్ ఉపఎన్నిక వేళ నల్గొండ, వరంగల్, ఖమ్మం మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.. అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం

CM KCR : నాగార్జున సాగర్ ఉపఎన్నికల వేళ నల్గొండ, వరంగల్, ఖమ్మం మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు...

  • Venkata Narayana
  • Publish Date - 11:01 pm, Sun, 28 February 21
సాగర్ ఉపఎన్నిక వేళ నల్గొండ, వరంగల్, ఖమ్మం మంత్రులతో సీఎం కేసీఆర్  భేటీ..  అనుసరించాల్సిన  వ్యూహాలపై దిశానిర్దేశం
CM KCR on Budget

CM KCR : నాగార్జున సాగర్ ఉపఎన్నికల వేళ నల్గొండ, వరంగల్, ఖమ్మం మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ఈజీ గా గెలుస్తుందని ఈ సందర్భంగా చెప్పారు కేసీఆర్. తాజా సర్వే లో 40 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు.. 33 శాతం కాంగ్రెస్ కు, 13 శాతం ఓట్లు బిజెపి వైపు వున్నట్లు తేలిందని కేసీఆర్ మంత్రులతో అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం mlc సీటు మనదే. మనమే గెలుస్తున్నాం అనికూడా కేసీఆర్ తేల్చిచెప్పేశారు. సిట్టింగ్ సీటు మిస్ కావద్దు.. నల్గొండ.. జగదీష్ రెడ్డి, వరంగల్ ఎర్రబెల్లి, సత్యవతి, ఖమ్మం పువ్వాడ అజయ్ కో ఆర్డినేట్ చేసుకోవాలి అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మొదటికి ఇప్పటికీ గ్రౌండ్ చాలా మారింది.. మొదట్లో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు కనపడటం లేదని కేసీఆర్ అన్నట్టు సమాచారం.

Read also : రాహుల్ అలుపెరుగని కష్టం, వెనుక.. పార్టీ సీనియర్ల వెన్నుపోట్లు, వెరసి, ఐదు రాష్ట్రాల ఎన్నికలవేళ కాంగ్రెస్‌లో వితపోకడలు