Podu Lands: రావణకాష్టంలా పోడు భూముల రగడ.. ఆ దరఖాస్తులకు మోక్షమెప్పుడు?

Podu Lands: పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల పోరు పచ్చని పల్లెల్లో ఫారెస్ట్ అధికారులు,

Podu Lands: రావణకాష్టంలా పోడు భూముల రగడ.. ఆ దరఖాస్తులకు మోక్షమెప్పుడు?
Podu Lands
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 18, 2022 | 11:48 AM

Podu Lands: పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల పోరు పచ్చని పల్లెల్లో ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య అగ్గి రాజేస్తోంది. పంతం నీదా నాదా.. సొంతం నీకా నాకా అంటూ పోడు భూములు స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, భూములను కాపాడుకునేందుకు గిరిజనులు యుద్ధానికి సైతం కాలు దువ్వుతున్నారు. ఒకరిది ఉద్యోగ ధర్మం – మరొకరిది భూమి కోసం ఏండ్ల పోరాటం. ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో పోడు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోడు భూములు సాక్షిగా యుద్ధానికి సై అంటున్న ఇరువర్గాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 లక్షల 28 వేల ఎకరాల్లో పోడు భూమి సాగు చేస్తున్నారు. పోడుభూముల స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లడం.. గిరిజనులు ఎదురుతిరగడం, ఆందోళన చెయ్యడం.. గిరిజనులకు అండగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు నిలబడటం నిత్యకృత్యంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పోడు సాగు దారుల పక్షాన నిలవడంతో అటవీ ఉద్యోగుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం – విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది. పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోడు భూముల పోరు ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెర లేపుతోంది.

పోడు భూముల్లో చావు కేకలు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో కొందరు ఆదివాసీ గిరిజనులు మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో ట్రెంచ్ కొడుతుండంతో ఏజెన్సీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజుల్లో ఇద్దరు గిరిజన రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇల్లందు నియోజకవర్గం ఏడుప్పలగూడెం చెందిన పోడు కుంజా రామయ్య అనే గిరిజన రైతు భూమిలో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ పనులను చేపట్టడంతో మనోవేదన వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన కన్నయ్య గత 40 సంవత్సరాల నుండి పోడు భూమి సాగు చేసుకుంటున్నాడు. పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు రావడంతో మనస్తాపం చెంది పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో పోడు రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

దరఖాస్తులకు మోక్షమెప్పుడు? పోడుభూముల సమస్య పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. పోడు భూములకు హక్కు పత్రాల కోసం స్వీకరించిన దరఖాస్తులపై జిల్లా అధికార యంత్రాంగం నేటి వరకూ నిర్దిష్ట చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీస్తోంది. పోడు భూముల ROFR పట్టాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,89,263 లక్షల ఎకరాల పోడు భూమికి 80,938 వేల రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 39,631 వేల ఎకరాల పోడు భూమికి 16,781 వేల రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఫారెస్ట్ అధికారులు పోడు భూములు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

పట్టాలివ్వాలని డిమాండ్.. ఏళ్ల తరబడి పోడు భూములలో వ్యవసాయం చేస్తున్న గిరిజనులు తమకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఎన్నికలు వచ్చినప్పుడు హామీ ఇవ్వటం తర్వాత మా మీద ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయించడం’’ దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. భూములలో పంటలు వేసినప్పుడల్లా ఫారెస్ట్ అధికారులు వచ్చి ధ్వంసం చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. భూమి కోసం భుక్తి కోసం తాము చేస్తున్న ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు గిరిజనులు. తమ తాతలు, తండ్రులు కాలం నుండి భూములు సాగు చేసుకుంటున్నామని, పోలీస్ కేసులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ, భూములను సాధించుకుంటామని ఉద్ఘాటించారు పోడు రైతులు.

పోడు భూములలో మొక్కలు.. ప్రభుత్వం పోడు భూములు విషయం తేల్చకపోవడంతో ఫారెస్ట్ అధికారులు పోడు భూములలో మొక్కలు నాటేందుకు సిద్ధం అవగా.. గిరిజనులు వారిని అడ్డుకుంటున్నారు. గిరిజనులు స్థానిక ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తేవడంతో చేసేది ఏమీ లేక ఎమ్మెల్యేలు సైతం ఫారెస్ట్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల వ్యవహారంలో గతంలో అధికారుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.. అధికారుల వైఖరిని తప్పుపట్టారు. తాను టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందే గిరిజనులకు న్యాయం చెయ్యడానికి అని కామెంట్ చేశారు. ప్రభుత్వం స్పందించి పోడు భూముల వ్యవహారంపై నిర్ణయం తీసుకోకపోతే ఈ వ్యవహారం మరింత ముదిరే ప్రమాదం లేకపోలేదన్నారు. ఇర ఎమ్మెల్యేలు గిరిజనుల పక్షాన నిలబడితే.. అది ఒక విధంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మారే ప్రమాదమూ లేకపోలేదు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం చేసుకుంటారో అని ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు.

ఏజెన్సీ జిల్లా కావడం.. పెద్ద ఎత్తున అడవులు ఉండటం.. ఆదివాసీ గిరిజన ప్రజలు అధికంగా ఉండడంతో సహజంగానే పోడు భూములు పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉంటారు. సొంత భూమి లేకపోవడంతో అడవిని నమ్ముకుని దానిలో కొంత భూమి సాగు చేసి పంటలు పండించి దేశానికి ఒక ముద్ద పెట్టి, తాము ఒక ముద్ద తినాలనే ఆశతో పోడు రైతులు భూమికోసం బ్రతుకు పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల విషయంలో అనేక పోరాటాలు చేశారు గిరిజనులు. గిరిజన సంఘాలు అనేక రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఒకరిది భూమి కోసం పోరాటం అయితే మరొకరిది ఉద్యోగ ధర్మం కోసం ఆరాటంగా మారిపోయింది. ఫారెస్ట్ అధికారులు, గిరిజనులు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పోడు భూములు రక్తంతో తడుస్తున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ పోడు సాగుదారులు, అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అటవీ శాఖ అధికారుల వివరణ.. 2005 నాటికి పోడు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. పోడు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయన్నారు. పోడు సాగు దారు చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో తాము కూడా ఏమీ చేయలేక పోతున్నామన్నారు అధికారులు. ఫారెస్ట్ భూములు పరిరక్షించడం తమ బాధ్యత అని, పోడు రైతులు ఆత్మహత్యలను కావాలనే కొందరు రాజకీయ నాయకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీదకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. 2016-2017 సంవత్సరంలో చాలామంది గిరిజనులు భారీ మొత్తంలో అడవిని నరికారని, అలాంటి భూముల్లో మొక్కలు నాటుతున్నామని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు వర్సె్స్ ఫారెస్ట్ ఆఫీసర్స్.. గిరిజనులు ప్రజా ప్రతినిధుల మీద ఒత్తిడి తేవడంతో పోడు భూముల వ్యవహారం చివరకు ఎమ్మెల్యేలు వర్సెస్ ఫారెస్ట్ అధికారులుగా మారిపోతుంది. ఫారెస్ట్ ఉన్నత అధికారులు పోడు భూములలో మొక్కలు నాటాలని కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు పోడు భూముల జోలికి వెళ్లొద్దు అని హుకుం జారీ చేస్తున్నారు. పోడు భూములు జోలికి వెళ్తే గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు ఘర్షణ తలెత్తుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో కిందిస్థాయి ఫారెస్ట్ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది.

– వాసు, టీవీ9 తెలుగు, ఖమ్మం.

Also read:

Reliance Jio: రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ.. మళ్లీ షాకిచ్చిన కస్టమర్లు..

Shiva Kandukuri: ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని ఏది బడితే అది చేయకూడదు.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్..

Nataraja Temple: 20 మంది పూజారులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఏ కారణంచేత అంటే..‌

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!