Telangana: మళ్లీ అదే సెంటిమెంట్‌ ఫాలో అవుతోన్న సీఎం రేవంత్‌.. అక్కడి నుంచే..

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించడం.. ఆ సభ కాంగ్రెస్ కు పునర్ జీవం పోయడంతో మళ్లీ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెళ్లి నుంచే తొలి బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎం హోదాలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడంతో...

Telangana: మళ్లీ అదే సెంటిమెంట్‌ ఫాలో అవుతోన్న సీఎం రేవంత్‌.. అక్కడి నుంచే..
Revanth Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2024 | 7:24 PM

ఆదివాసీ పోరాటాల పురిటి గడ్డ ఇంద్రవెళ్లి నుండే సీఎం రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌లో ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సభ బాద్యతలను భుజానికెత్తుకున్న మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే కు అదనపు బాద్యతలు అప్పగించారు.

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించడం.. ఆ సభ కాంగ్రెస్ కు పునర్ జీవం పోయడంతో మళ్లీ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెళ్లి నుంచే తొలి బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎం హోదాలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడంతో అటు అధికారులు, ఇటు హస్తం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్టి.. సీఎం అయ్యాక ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

స్మృతి వన శంఖ స్థాపనకు‌ స్వయంగా తానే వస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల 2 న ఇంద్రవెళ్లి పర్యటించబోతున్నారు. ఇంద్రవెళ్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నాగోబాను దర్శించుకోబోతున్నారు. సీఎం హోదాలో ఎన్టీఆర్ తర్వాత నాగోబాను దర్శించుకోనున్న తొలి తెలంగాణ సీఎంగా రికార్డ్‌ల్లోకి ఎక్కనున్నారు‌. సీఎం రాక నేపథ్యంలో అన్నీ ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు మంత్రి సీతక్క సూచనలు చేశారు. ఈ బహిరంగ సభ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖరావ సభగా సాగనుందని తెలుస్తోంది. 12 లోక్‌సభ స్థానాల్లో గెలుపే టార్గెట్‌ గా ఈ సభను నిర్వహించేందుకు రంగం సిద్దం చేసింది హస్తం పార్టీ. ఈ సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారని సమాచారం.

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మరో రెండు గ్యారంటీల అమలు చేయాలని.. ఇంద్రవెళ్లి సభ నుండే శ్రీకారం చుట్టాలని‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారంలో మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పిన రేవంత్‌.. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి సభతో ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్‌లోనే మాత్రమే విజయం సాధించడంతో ఆదిలాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కత్తి మీద సాములా మారింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును బీజేపీకి తిరిగి దక్కకుండా పావులు కదుపుతూనే కీలక నేతలను ఆదిలాబాద్ పార్లమెంట్‌కు అదనపు ఇంఛార్జ్ లుగా నియమించే అవకాశం కనిపిస్తోంది.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ జెట్ స్పీడ్‌తో పుంజుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటిలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించడం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత జోష్‌తో దూసుకుపోతుండటంతో ఇంద్రవెళ్లి సభతో బీజేపీ స్పీడ్ కు బ్రేకులు వేసేలా సభ నిర్వాహించాలని హస్తం శ్రేణులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారీ జనసమీకరణతో ప్రత్యర్థులకు ఇంద్రవెళ్లి సభతో సంకేతాలు పంపుతూనే ప్రజలను మరిన్ని వరాల జల్లులు కురిపించాలని ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను హైదరాబాద్ పిలిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇంద్రవెళ్లి సభ బాద్యతలను తిరిగి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు అప్పగించే అవకాశాలున్నాయి.

గతంలో పీసీసీగా ఉన్న సమయంలో ఆయన ఆద్వర్యంలోనే సభ సక్సెస్ కావడంతో మంత్రి సీతక్క తో పాటు ఆయనకు అధనపు బాద్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. ఇంద్రవెల్లి సభ తర్వాత కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంద్రవెళ్లి సభ ద్వారా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీల అమలు ప్రకటన ఉండనుందని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..