Munugode bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?.. రేపటి సభలో ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్..

ఈ వేదిక పైనుంచే తమ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయనున్నట్టు ఇటీవలే జరిగిన రివ్యూ మీటింగ్‌లో హింట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Munugode bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?.. రేపటి సభలో ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్..
Cm Kcr
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Aug 19, 2022 | 9:42 PM

మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గ్రిప్ సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నం ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక గులాబీ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శనివారం సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభావేదికగా కీలక ప్రకటన ఉండనుంది.

ప్రజాదీవెన పేరుతో శనివారం టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేదిక పైనుంచే తమ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయనున్నట్టు ఇటీవలే జరిగిన రివ్యూ మీటింగ్‌లో హింట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే తిరిగి టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్ధి ఎవరైనా సరే.. భారీగా బలప్రదర్శన చేసి తమ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించేలా ప్లాన్ చేస్తుంది టీఆర్‌ఎస్. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మేల్యేలు.. సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మూడు లక్షల మందితో సభ నిర్వహించేలా గులాబీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే మండలాల వారిగా బాధ్యతలు కూడా కేటాయించారు.

మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్‌లాగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలవాలని ముూడు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu