అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీజేపీ నేతపై చేయిచేసుకున్న సీఐ..

మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలోని కొత్త పేట మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన స్వల్ప వివాదం.. పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. మార్కెట్ మూసివేశారన్న విషయం తెలియని  రైతులు.. మామిడి పండ్ల లారీలతో పెద్ద సంఖ్యలో మార్కెట్ వద్దకు చేరుకున్నారు. అయితే మార్కెట్ మూసివేశారు కదా..?.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ పోలీసులు రైతులపై మండిపడ్డారు. అంతేకాదు.. వాహనాల నంబర్లను పోలీసులు ఫోటోలు తీస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాల నుంచి వచ్చిన […]

అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీజేపీ నేతపై చేయిచేసుకున్న సీఐ..
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 1:55 PM

మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలోని కొత్త పేట మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన స్వల్ప వివాదం.. పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. మార్కెట్ మూసివేశారన్న విషయం తెలియని  రైతులు.. మామిడి పండ్ల లారీలతో పెద్ద సంఖ్యలో మార్కెట్ వద్దకు చేరుకున్నారు. అయితే మార్కెట్ మూసివేశారు కదా..?.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ పోలీసులు రైతులపై మండిపడ్డారు. అంతేకాదు.. వాహనాల నంబర్లను పోలీసులు ఫోటోలు తీస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాల నుంచి వచ్చిన తమ పరిస్థితి ఏంటంటూ నిరసనకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం హీటెక్కింది. అయితే విషయం తెలుసుకున్న రైతుల నాయకుడు, బీజేపీ నేత సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. అయితే రైతులతో మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న చైతన్యపురి సీఐ జానకి రెడ్డి.. వెళ్లిపోవాలంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు. ఈ క్రమంలో సీఐ బీజేపీ నేతపై చేయి చేసుకోవడంతో.. సదరు నేత కూడా ఎదురు ప్రశ్నించారు. దీంతో సీఐ తీవ్ర పదజాలంతో బీజేపీ నేతపై దాడికి దిగాడు. సీఐ జానకీ రెడ్డి‌ తీరుపై బీజేపీ నేతలు, రైతులు ఖండించారు.