Bandi Sanjay: కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారు.. గవర్నర్ పై కావాలనే దుష్ప్రచారం.. బండి సంజయ్ ఫైర్..

తెలంగాణ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. గవర్నర్ ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎందుకు గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని...

Bandi Sanjay: కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారు.. గవర్నర్ పై కావాలనే దుష్ప్రచారం.. బండి సంజయ్ ఫైర్..
Bandi Sanjay
Follow us

|

Updated on: Jan 30, 2023 | 3:06 PM

తెలంగాణ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. గవర్నర్ ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎందుకు గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని నిలదీశారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని.. కావాలనే గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోందన్న బండి సంజయ్.. ఎస్, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల కోసం బీజేపీ చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తోందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీసుకు వెళ్తే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో పోలీసుల దాడులు చాలా ఎక్కువయ్యాయని విమర్శించారు. పోలీసుల దాడిలో గాయాలపాలైన భానుప్రసాద్ కు ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ట్రీట్ మెంట్ జరుగుతోందని, ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్..

దేశంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ కంటే ఎక్కువగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో కండిషన్స్ ఉన్నాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి. తప్పులు చేసింది కేసీఆర్, అందుకు 2 లక్షల మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారు. కేసీఆర్ నిజాం రాజులా ప్రవర్తిస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.

      – బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదన్న బండి సంజయ్.. ఎక్కడ ఏర్పాటు చెయ్యాలో కూడా చెప్పలేదన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సర్పంచుల నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!