కేజ్రీ‘వాల్‌’ను ఢీకొట్టేదెలా?

వరుస పరాజయాలు, పరాభవాలు, చేదు అనుభవాలతో సతమతమవుతున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లోనైనా గట్టెక్కి పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మినహా ఈ మధ్య జరిగిన చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోతూ వచ్చింది. హరియాణాలో మరో పార్టీతో జతకట్టి అధికారాన్ని నిలబెట్టుకున్నా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి పడింది. […]

కేజ్రీ‘వాల్‌’ను ఢీకొట్టేదెలా?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 03, 2020 | 3:11 PM

వరుస పరాజయాలు, పరాభవాలు, చేదు అనుభవాలతో సతమతమవుతున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లోనైనా గట్టెక్కి పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మినహా ఈ మధ్య జరిగిన చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోతూ వచ్చింది. హరియాణాలో మరో పార్టీతో జతకట్టి అధికారాన్ని నిలబెట్టుకున్నా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి పడింది. దేశమంతటా గెలిచి, దేశాన్ని ఏలే ఢిల్లీలో 2015లో చవిచూసిన ఘోర పరాజయ గాయం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఎంత ఘన విజయం సాధించినా, ఆ పార్టీ అధినేతలు ఢిల్లీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలు వారికి ఆందోళన కల్గిస్తున్నాయి. భారీ మెజారిటీ మాట పక్కన పెట్టి, కనీసం బొటాబొటీ సాధించి సర్కారు నెలకొల్పినా చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆ సాధారణ లక్ష్యం కూడా వారికి సవాలుగానే మారింది.

సీఎం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు

ఈ పరిస్థితుల్లో ఎన్నికల రణక్షేత్రంలో గెలుపు వ్యూహాలపై కమలనాథులు కసరత్తు మొదలుపెట్టారు. ముందుగా ఢిల్లీలో బలమైన నేతగా పాతుకుపోతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢీకొట్టే సీఎం అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఓటర్లు పార్టీలు, వాటి సిద్ధాంతాలు చూసి ఓటు వేసే రోజులు పోయి, సీఎం అభ్యర్థి, పీఎం అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తున్నారని ఈ మధ్య జరిగిన అనేక ఎన్నికలు రుజువు చేశాయి. అందుకే ఢిల్లీలో కేజ్రీవాల్‌కు ధీటైన నేతను బరిలో దింపితే ఎంతో కొంత ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. 2015లోనూ ఇలాగే భావించి కిరణ్ బేడీని నిలబెట్టినప్పటికీ అది బెడిసికొట్టడంతో ఆ అనుభవం నేర్పిన పాఠాలతో ఈసారి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

కేజ్రీవాల్.. ఓ పెద్ద సవాల్

ఐఆర్ఎస్ అధికారి నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమకర్తగా మారి ఆ తర్వాత రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కైవసం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీకి కొరుకుడు పడని కొయ్యగా మారారు. తిరుగులేని మెజారిటీతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేంద్రంతో ప్రతి విషయానికీ తగవులాడుతూ పేచీకోరుగా పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కేజ్రీవాల్‌కు అన్ని విధాలుగా సహాయ నిరాకరణ కొనసాగిస్తూ వచ్చింది. అయినా సరే.. కేజ్రీవాల్ తనకు ఓటేసిన జనం మనసు గెలుచుకునే పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్ విద్య, వైద్యం నుంచి ఉపశమనం కలిగించేలా ఈ రెండు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నడుం బిగించారు. అవి సత్ఫలితాలనిచ్చాయి. ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడుతూ విద్యా బోధనలో నాణ్యత పెంచారు. ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ క్లాసులు పెట్టి మరీ వారికి లక్ష్యాలు నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తూ, అధునాతన హంగులతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేశారు. మొహల్లా క్లినిక్‌లు, సంచార క్లినిక్‌లతో వైద్యాన్ని ప్రజలు నివసించే బస్తీల దగ్గరకే తీసుకెళ్లారు. అక్కడికక్కడే వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులతో రోగ నిర్ధారణ, మందుల పంపిణీ జరిగేలా చేసిన ఏర్పాట్లు ప్రశంసలు అందుకున్నాయి. కేవలం మాజీ బ్యూరోక్రాట్‌ అనుభవాన్ని పాలనలో అమలు చేయడంతోనే సరిపెట్టలేదు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగానూ రూపాంతరం చెంది ప్రజాకర్షక పథకాలతో దూసుకెళ్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి పూర్తిగా ఎన్నికలు – ఓట్ల లెక్కలతోనే పథకాలు ప్రారంభించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, విద్యుత్తు బిల్లుల్లో 200 యూనిట్ల వరకు పూర్తి రాయితీ, 200 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం రాయితీ, నీటి బిల్లులపై దాదాపు పూర్తి రాయితీ వంటి నిర్ణయాలు కేజ్రీవాల్ జనాదరణను మరింత పెంచాయి. దీంతో కేజ్రీవాల్‌ను కాదని బీజేపీకి ఓటేసేలా జనాన్ని ఒప్పించడం బీజేపీ నేతలకు కష్టంగా మారింది.

కాలనీ కానుకలు.. రాల్చేనా ఓట్లు

కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాకపోవడంతో పోలీస్ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండగా, ఢిల్లీలో ల్యాండ్ రికార్డులన్నీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేతిలో ఉంటాయి. దీంతో ఢిల్లీలోని 1,731 అక్రమ కాలనీలను రెగ్యులరైజ్ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కాలనీల్లో ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండా ఇళ్లను కట్టుకుని నివసిస్తున్న లక్షలాది మంది లబ్ది పొందనున్నారు. అందుకే ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తొలి సభలోనే కాలనీలను రెగ్యులరైజ్ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు, సభా కార్యక్రమాలు రూపొందించారు. అయితే ఈ చట్టం కేవలం ప్రాపర్టీ మీద యాజమాన్య హక్కులు మాత్రమే కల్పిస్తుంది తప్ప రెగ్యులరైజ్ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అక్రమ కాలనీలు రెగ్యులరైజ్ అవుతాయని చెబుతూ బీజేపీ నేతలు ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శిస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్రమకాలనీ వాసులు ఎంతమేర బీజేపీ వెంట నిలుస్తారన్నది బీజేపీ నేతలకే అంతుచిక్కడం లేదు.

గత అనుభవం – నేర్పిన పాఠం

కేజ్రీవాల్‌ను ఢీకొట్టే ప్రయత్నం ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిందేమీ కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐఆర్ఎస్ అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీగా ఐపీఎస్ కిరణ్ బేడీని రంగంలోకి దించారు. ఫైర్‌బ్రాండ్ లేడీ ఆఫీసర్‌గా అప్పటికే కిరణ్ బేడీకి ఉన్న క్రేజ్, బ్యూరోక్రాట్‌గా సుదీర్ఘానుభవం పనికొస్తాయని, నాటి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు పోటీగా మహిళా ఓట్లను కూడా రాబట్టుకోవచ్చునని బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచించింది. అయితే ఈ వ్యూహాన్ని ప్రజల కంటే ముందు సొంత పార్టీ నాయకత్వమే తిప్పికొట్టింది. పార్టీతో సంబంధం లేని వ్యక్తిని అకస్మాత్తుగా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. ఫలితంగా అన్ని విధాలుగా సహాయ నిరాకరణ ఎదురైంది. అందుకే ఈసారి సీఎం అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగు ముందుకేస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..