Bird Flu Scares In Nizamabad: ఆ జిల్లాలో భారీగా మరణిస్తున్న కోళ్లు.. భయాందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని కేంద్రం పాటించింది. అన్ని రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది. బర్ద్ ఫ్లూ తో పక్షులు, కోళ్లు మృతి చెందుతుండంతో అందరినో భయం నెలకొంది. ఇప్పటి వరకూ తెలంగాణలో..

Bird Flu Scares In Nizamabad: ఆ జిల్లాలో భారీగా మరణిస్తున్న కోళ్లు.. భయాందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
Follow us

|

Updated on: Jan 10, 2021 | 12:32 PM

Bird Flu Scares In Nizamabad: దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని కేంద్రం పాటించింది. అన్ని రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది. బర్ద్ ఫ్లూ తో పక్షులు, కోళ్లు మృతి చెందుతుండంతో అందరినో భయం నెలకొంది. ఇప్పటి వరకూ తెలంగాణ లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కోళ్లు మృతి చెందుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ లో మేత‌కు వెళ్లిన కోళ్లు ఎక్కడికక్కడే పడిపోతున్నాయి. అలా పడిపోయిన కొద్ది సేప‌టికే మృత్యువాత పడుతున్నాయి. దీంతో బర్ల్ ప్లూ తోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్ధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి కోళ్ల మృతి కి బర్ద్ ఫ్లూ కాదని.. రానికేట్ అనే వ్యాధితో మరణిస్తున్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. రక్త నమూనాలు సేకరించి కోళ్ల మృతికి కారణాలను వెతికే పనిలో పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 380 పౌల్ట్రీ ఫారాలు ఉండగా 8లక్షల కోళ్లను పెంచుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ వైద్య శాఖ మంత్రి కూడా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపధ్యంలో కోళ్ల ఫారాల్లో బర్ల్ ప్లూ పై అవగాహన కల్పించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:  దేశంలో 7 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు ప్రకటించిన కేంద్రం, ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం