కాంగ్రెస్ గెలుపు ఖాయం-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాలలో రామన్నపేట, చిట్యాల, నార్కెట్ పల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుబ్బాక నర్సింహ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి […]

కాంగ్రెస్ గెలుపు ఖాయం-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాలలో రామన్నపేట, చిట్యాల, నార్కెట్ పల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుబ్బాక నర్సింహ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… వెంకట్ రెడ్డి 4 పర్యాయాలు ఎమ్యెల్యేగా ప్రజా సేవ చేశారన్నారు. టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి చిరుమర్తి లింగయ్య పార్టీ మారితే చాలా బాధ అనిపించింది. అన్నం పెట్టి, రాజకీయ భిక్షపెట్టిన వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు చిరుమర్తి.. అంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. 90 మంది ఎమ్యెల్యేలు తమ పార్టీలో ఉండగా కూడా.. 10 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలను పార్టీలోకి తీసుకుండు అంటే ప్రశ్నించే గొంతు లేకుండా నియంతలాగా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతును మునుగోడు నుండి గెలిపించారు.. అదే తీరుగా పార్లమెంట్ కు సోదరుడు వెంకటరెడ్డిని గెలిపించి పంపియ్యాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ కు ఎంత మెజారిటీ వస్తుందా అని నకిరేకల్ నియోజకవర్గం వైపు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తుందన్నారు. 15 రోజులు రాత్రి పగలు కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu