వేట మొదలైంది.. పులి రావడమే ఆలస్యం.. బెబ్బులిని బంధించేందుకు రెడీ అంటున్న ఫారెస్ట్ అధికారులు

మ్యాన్‌ ఈటర్‌ కోసం వేట మొదలైంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. భీమన్నపేట అటవీప్రాంతంలో ఎరగా..

వేట మొదలైంది.. పులి రావడమే ఆలస్యం.. బెబ్బులిని బంధించేందుకు రెడీ అంటున్న ఫారెస్ట్ అధికారులు
Representative Image
Follow us

|

Updated on: Jan 13, 2021 | 8:52 AM

A-2 Tiger : మ్యాన్‌ ఈటర్‌ కోసం వేట మొదలైంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. భీమన్నపేట అటవీప్రాంతంలో ఎరగా వేసిన ఓ పశువును ఈ పెద్దపులి సోమవారం చంపేసింది. అలా చంపాక ఆ మాంసాన్ని తినేందుకు ఏ పులి అయినా రెండోసారి మళ్లీ వస్తుంది. దీంతో కంది భీమన్న అటవీప్రాంతంలోని సంఘటన స్థలానికి పక్కనే అటవీశాఖ ఓ మంచె ఏర్పాటుచేసింది. అక్కడికి పులి రాగానే మత్తు ఇంజక్షన్‌తో బంధించేందుకు ప్రణాళిక రచించింది.

ఆకలి తీర్చుకునేందుకు కొద్దిరోజులుగా ఈ పెద్దపులి పశువుల్ని చంపుతోంది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు కొన్నిచోట్ల పశువుల్ని కట్టేసి ఎరగా ఉంచి పద్మవ్యూహం పన్నారు. ఇందులో చిక్కిన ఏ-2 పెద్దపులి రెండ్రోజుల క్రితం కంది భీమన్న అటవీప్రాంతంలో ఎరగా ఉంచిన పశువుని చంపింది. ఇప్పుడు ఆ ప్రదేశానికి 20-30 మీటర్ల దూరంలోనే ఓ మంచె ఏర్పాటుచేశారు. ఇద్దరు పశువైద్యులతో పాటు ఒకరిద్దరు అటవీ అధికారులు మంగళవారం నుంచే ఆ మంచెపైకి ఎక్కి పులి కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సమీపంలో ఓ క్యాంప్‌, 10 కి.మీ. దూరంలో బెజ్జూరులో మరో క్యాంప్‌ ఏర్పాటుచేశారు. ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ వినోద్‌కుమార్‌, స్థానిక డీఎఫ్‌ఓ శాంతారాంతో పాటు తెలంగాణ అటవీశాఖ అధికారులు, 40 మంది సిబ్బంది పెద్దపులిని బంధించేందుకు రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్‌కు సహకరించేందుకు మహారాష్ట్ర నుంచి 8 మంది అధికారులు వచ్చారు. మత్తు ఇంజక్షన్‌కు పులి చిక్కితే తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని రప్పించారు.

దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎటువైపు నుంచి బెబ్బులి తమపై దాడి చేస్తుందోనని.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల దూరం నుంచే అధికారులు ఆంక్షలు విధించారు. స్థానిక గ్రామాల ప్రజలు సమీపంలోని అడవిలోకి రాకపోకలను నిలివేశారు. అనుకున్నట్లుగా ఏ-2 పులి పట్టుబడితే హైదరాబాద్‌ జూకి తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పొలం పనులకు వెళ్లే గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. మ్యాన్‌ ఈటర్‌ దాడితో అలెర్ట్‌ అయిన ఫారెస్టు సిబ్బంది.. బెజ్జూరులో మరో క్యాంప్‌ ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు మొత్తం 40 మంది అధికారులు రంగంలోకి దిగారు. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి :

కోడి పందేలకు సై అంటున్న ఉభయగోదావరి జిల్లాలు.. బరులు సిద్ధం చేస్తున్న పందెంరాయుళ్లు

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్