స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మల్కజ్గిరిలో జరిగిన బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ వ్యవహారం చినికి, చినికి గాలివానగా మారుతోంది. ఘర్షణ సమయంలో దళితులను దూషించడంతో పాటు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కాళ్లతో తన్ని అవమానించారన్న విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుతో పాటు కేసులో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఎస్సీ కమిషన్ ఆదేశించింది. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్న ఎస్సీ కమిషన్ హెచ్చరించింది. బుధవారం ఢిల్లీ నుంచి జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ అల్డర్ హైదరాబాద్ వచ్చి బాధితులను నేరుగా కలిసి విచారణ జరిపిన అనంతరం.. ఎస్సీ కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదు కాగా రాజ్యంగబద్దమైన కమీషన్ నేరుగా ఆదేశాలు ఇవ్వడంతో.. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే…
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ నగరంలోని మల్కజ్గిరిలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవ జరిగిన సమయంలో మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు స్థానిక బీజేపీ కార్పోరేటర్ శ్రావణ్ కూడా పాల్గొన్నారు. కాగా దాడిలో కార్పోరేటర్ శ్రావణ్ కాలికి గాయం కావడంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కార్పోరేటర్ శ్రావణ్‌ను పరామర్శించిన అనంతరం మైనంపల్లిపై విమర్శలు గుప్పించారు. అనంతరం మైనంపల్లి కూడా ప్రెస్‌మీట్ పెట్టి బండి సంజయ్‌పై మాటల తూటాలు పేల్చారు. దీంతో వ్యవహారం హీటెక్కింది. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఈ ఇష్యూపై ఫోకస్ పెరిగింది.
Also Read:అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ అలెర్ట్.. అందుకు గడువు పొడిగింపు
అక్రమ మద్యం కేసులో ఏపీ మంత్రి అనుచరులు అరెస్ట్.. తీగ లాగితే కదిలిన డొంక