Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నేడు మరోసారి హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు ( మంగళవారం) హై కోర్ట్ లో విచారణ జరగనుంది. సీబీఐతో విచారించాలన్న పిటిషన్లపై నేడు వాదనలు జరగనున్నారు. సిట్ పారాదర్శకంగా దర్యాప్తు జరపడం లేదని పిటిషనర్ల...

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నేడు మరోసారి హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..
Ts Highcourt
Follow us

|

Updated on: Dec 13, 2022 | 9:23 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు ( మంగళవారం) హై కోర్ట్ లో విచారణ జరగనుంది. సీబీఐతో విచారించాలన్న పిటిషన్లపై నేడు వాదనలు జరగనున్నారు. సిట్ పారాదర్శకంగా దర్యాప్తు జరపడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం చెప్పినట్టే సిట్ చేస్తోందని వాదించారు. సిట్ దర్యాప్తు సక్రమంగానే జరుగుతుందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. మరోవైపు.. తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నంద కుమార్ మోసాల చిట్టా బయటపడుతోంది. నంద కుమార్ పై మరో ఫిర్యాదు నమోదవడం సంచలనంగా మారింది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే యాభై శాతం వాటా ఇస్తానంటూ మోసం చేసినట్లు మానిక్ చంద్ పాన్ మసాలా యజమాని కుమారుడు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నంద కుమార్ ద్వారా రూ.2 కోట్లు నష్టపోయినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఏడుగురిని నిందితులుగా చేర్చింది. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీని కస్టడీలోకి తీసుకుని విచారించింది. అయితే, ఇదే కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌తో పాటు.. కేరళ డాక్టర్ జగ్గుస్వామిని విచారిస్తే మరిన్ని కీలక వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కి మధ్యవర్తిగా డాక్టర్ జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ ఆరోపించింది. అందుకే ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా కోర్టును ఆశ్రయించడంతో…కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది న్యాయస్థానం.

మరోవైపు.. ఈ కేసులో అరెస్టై నెలన్నర రోజులుగా జైలులో ఉన్న నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌.. విడుదలైన వెంటనే పోలీసులు వారిని ఇతర కేసుల్లో అరెస్టు చేశారు. కారాగారం నుంచి తమ వస్తువులతో ఇద్దరూ బయటికి రాగా.. అప్పటికే గేటు వద్ద పోలీసులు కాపు కాశారు. నిందితులిద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు. గత నెల 24న మెదక్ జిల్లా గజవాడకు చెందిన బాలయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఇద్దరినీ విచారించేందుకు కారాగారం నుంచి బయటికొచ్చిన మరుక్షణమే పోలీసులు వీరిని అరెస్టు చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి