తెలంగాణకు మరో కేంద్ర అవార్డు.. ఈ – పంచాయతీ నిర్వహణలో దేశంలోనే నెంబర్‌ వన్‌

Central Award for Telangana : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్

  • uppula Raju
  • Publish Date - 9:38 pm, Wed, 14 April 21
తెలంగాణకు మరో కేంద్ర అవార్డు.. ఈ - పంచాయతీ నిర్వహణలో దేశంలోనే నెంబర్‌ వన్‌
Central Award For Telangana

Central Award for Telangana : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పంచాయత్ పురస్కారాలను అందజేస్తోంది. 2019-20 సంవత్సరానికి ఈ అవార్డు దక్కింది. దేశంలోని గ్రామ పంచాయతీ లను కేంద్రం పంచాయతీ ఎంటర్ ప్రైజ్, సూట్అప్లికేషన్స్, స్టేట్ specific applications అంటూ 3 విభాగాలుగా విభజించింది. ఇందులో రెండో విభాగంలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మూడో స్థానంలో రాజస్థాన్ అవార్డులు దక్కాయి.

ఈ అవార్డు రావ‌డంపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ అవార్డులు రావ‌డానికి కార‌ణ‌మైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గ‌ద‌ర్శి సీఎం కేసీఆర్‌ గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి, దార్శ‌నిక‌త వ‌ల్లే ఇదంతా సాధ్య‌ప‌డింద‌న్నారు. ఇంత మంచి శాఖ‌ను త‌న‌కు అప్ప‌గించ‌డం, అనేక అవార్డులు రావ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక తెలంగాణ ఏర్ప‌డ్డాక‌, గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న‌కు సీఎం కేసీఆర్ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చార‌ని గుర్తు చేశారు.

అలాగే గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్నారని తెలిపారు.కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర స్థానిక సంస్థలకు 12 అవార్డులు వచ్చాయని, అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పుడు అలాంటి గంగ‌దేవి ప‌ల్లెలు తెలంగాణ రాష్ట్ర‌మంతా ఏర్ప‌డుతున్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. వాటికి నిద‌ర్శ‌న‌మే ఈ అవార్డుల‌ని చెప్పారు. కాగా, ఈ అవార్డులు రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, తన పేషి, ఇతర రాష్ట్ర స్థాయి నుంచి పారిశుధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరికీ మంత్రి అభినందనలు తెలిపారు.

Maharashtra corona cases: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. కొత్తగా 278 మంది మృత్యువాత

పవన్ కళ్యాణ్‌న్ని చాలా ప్రేమిస్తాను కాబట్టే..పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో కూడా ఇలానే – ప్రకాష్ రాజ్ :Prakash Raj Video .