శామీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం… 60 వాహనాలు దగ్ధం!

మండుతున్న ఎండలు జనాలనే ఠారెత్తించడం కాదు, ఏకంగా ఆపదలో ఉన్న వారిని రక్షించే 108 వాహనాలూ ప్రమాదంలో పడ్డాయి. హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పేట్‌బషీరాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్ లో ‘108’ వాహనాలకు చెందిన ఈఎంఆర్‌ఐ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మరమ్మతులతో మూలకు చేరుకున్న వాహనాలను అక్కడ ఉంచారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరగడంతో 60 వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని సిబ్బంది […]

శామీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం... 60 వాహనాలు దగ్ధం!
Follow us

| Edited By: Srinu

Updated on: May 07, 2019 | 5:59 PM

మండుతున్న ఎండలు జనాలనే ఠారెత్తించడం కాదు, ఏకంగా ఆపదలో ఉన్న వారిని రక్షించే 108 వాహనాలూ ప్రమాదంలో పడ్డాయి. హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పేట్‌బషీరాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్ లో ‘108’ వాహనాలకు చెందిన ఈఎంఆర్‌ఐ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మరమ్మతులతో మూలకు చేరుకున్న వాహనాలను అక్కడ ఉంచారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరగడంతో 60 వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని సిబ్బంది వెంటనే గుర్తించకపోవడంతో వాహనాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక సీఐ మహేశ్‌ తెలిపారు. షార్ట్ సర్క్యూటే ఘటనకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.