Telangana: కొంప ముంచిన మద్యం వ్యసనం.. ఓల్డ్ స్టూడెంట్స్ అని నమ్మించి.. టీచర్ ఇంట్లో సర్వం స్వాహా..

టీచర్లు చాలా మందికి రోల్ మోడల్. వారు ఎక్కడ కనిపించినా నమస్కరిస్తాం. గతం తాలూకూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. చేసిన అల్లరి, చిలిపి పనుల గురించి జోక్స్ వేసుకుంటుంటాం. అయితే.. సంగారెడ్డిలో జరిగిన ఓ ఘటన..

Telangana: కొంప ముంచిన మద్యం వ్యసనం.. ఓల్డ్ స్టూడెంట్స్ అని నమ్మించి.. టీచర్ ఇంట్లో సర్వం స్వాహా..
Ongole Theft
Follow us

|

Updated on: Sep 30, 2022 | 7:06 AM

టీచర్లు చాలా మందికి రోల్ మోడల్. వారు ఎక్కడ కనిపించినా నమస్కరిస్తాం. గతం తాలూకూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. చేసిన అల్లరి, చిలిపి పనుల గురించి జోక్స్ వేసుకుంటుంటాం. అయితే.. సంగారెడ్డిలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాము ఓల్డ్ స్టూడెంట్స్ అని పరిచయం పెంచుకున్న ఇద్దరు యువకులు.. ఆ టీచర్ ఇంట్లోని నగదు, బంగారం తీసుకుని ఉడాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో లక్ష్మీ నారాయణ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఓ రోజు ఆయన మార్కెట్‌ యార్డు సమీపంలో మద్యం సేవిస్తున్నాడు. ఆ సమయంలో అటు వైపు ఇద్దరు యువకులు వచ్చారు. తాము స్టూడెంట్స్ అని, మీ దగ్గరే పాఠాలు నేర్చుకున్నామని, గుర్తున్నామా అని మాటలు కలిపారు. వీరి మధ్య చనువు ఏర్పడడంతో తరచూ కలిసి మద్యం తాగుతుండేవారు. ఈ క్రమంలో మద్యం తాగుతుండగా స్టఫ్ అయిపోయింది. తినేందుకు ఏమైనా తీసుకువస్తామని చెప్పి లక్ష్మీ నారాయణ బైక్ తీసుకువెళ్లారు.

అయితే.. బైక్ తాళంచెవి గుత్తికే ఇంటి తాళంచెవి ఉంది. దీంతో వారు నేరుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. బీరువా తాళాన్ని పగలగొట్టారు. ఇంట్లో ఉన్న రూ.30 లక్షలు నగదు, 10 తులాల బంగారాన్ని లూటీ చేశారు. కేవలం 14 నిమిషాల్లోనే వారు దొంగతనం పూర్తి చేసుకున్నారు. రాత్రి అవుతున్నా బైక్ తీసుకెళ్లిన యువకులు రాకపోవడంతో లక్ష్మీ నారాయణ కంగారు పడ్డారు. ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం లేకుండా గడియ పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న డబ్బులు, బంగారు నగలు కనిపించలేదు. వెంటనే సమీపంలోని పోలీసులకు దొంగతనం జరిగినట్లు కంప్లైంట్ చేశాడు.

రెండు నెలల క్రితం ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని పోలీసులకు చెప్పాడు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకున్నాని, ఆ నగదులో ప్లాట్ కొనుక్కుందామని భావించానని వివరించాడు. అదే సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితుడు వాపోయాడు. అతని కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని ఎస్ఐ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..