Telangana: రహదారిపై చెత్త వేసిన ఆ వ్యక్తికి మున్సిపల్ సిబ్బంది ఇలా ఝలక్ ఇచ్చారు

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తప్పని తెలిసినా.. కొందరు తమ తీరుని మార్చుకోరు. హా.. ఏమవుతుందిలే అన్నట్లు.. ప్లాస్టిక్ బాక్సులు, వాటర్ బాటిల్స్, ఇలా ఎటువంటి చెత్తనైనా సరే రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తికి షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మున్సిపల్ సిబ్బంది.

Telangana: రహదారిపై చెత్త వేసిన ఆ వ్యక్తికి మున్సిపల్ సిబ్బంది ఇలా ఝలక్ ఇచ్చారు
Garbage On The Road
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 25, 2024 | 12:27 PM

పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది ఇళ్లలోని చెత్తను సేకరిస్తుంటారు. చెత్త సేకరణపై మున్సిపల్ సిబ్బంది మైక్‌ల ద్వారా అనౌన్స్ చేస్తూ జనానికి అవగాహన కల్పిస్తుంటారు. అయినా కొందరు మాత్రం.. తమకేం పట్టనట్లుగా చెత్తను రోడ్లపై వేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా రహదారిపై చెత్తను వేసిన ఓ ప్రైవేటు ఉద్యోగికి మున్సిపల్ సిబ్బంది వినూత్న సన్మానం చేశారు.. ఆ సన్మానం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా 65వ జాతీయ రహదారి పక్కన మునిసిపల్ కార్మికులు చెత్తను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ శివారు లింగోజిగూడెంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుంచి కంపెనీకి వెళూతూ ఇంటి నుంచి ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన చెత్తను జాతీయ రహదారి వెంట పడవేశారు. గమనించిన మునిసిపల్ పర్యావరణ ఇంజినీర్ రేణుకుమార్, మున్సిపల్ కార్మికులు వెంటనే ఆ ఉద్యోగిని అడ్డుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించిన మునిసిపల్ పర్యావరణ ఇంజినీర్ మూడు పూల దండలను కొనుక్కొని వెంట తెచ్చుకున్నారు. ఓ పూల దండతో చెత్త వేసిన ఉద్యోగిని సన్మానించారు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త మునిసిపాలిటీ చెత్త సేకరణ ట్రాక్టర్లకు ఇవ్వాలని, ఇలా బహిరంగంగా వేయడం సరికాదని మున్సిపల్ ఇంజనీర్, సిబ్బంది చెప్పారు. తప్పును అంగీకరించారు ఆ పరిశ్రమ ఉద్యోగి. దాంతో.. ‘మళ్లీ ఎక్కడా కూడా చెత్తను పడేయను.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటా…మునిసిపాలిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆటోలోనే చెత్త వేస్తా’ అని అతడితో మునిసిపల్ సిబ్బంది ప్రతిజ్ఞ చేయించారు. మరోసారి ఇలా చేయబోనని, మళ్లీ ఎక్కడా చెత్త వేయను.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ ఉద్యోగి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..