ఆయనకు భార్య అంటే ప్రాణం.. ఆమె తీపి జ్ఞాపకాలు మరిచిపోలేక ఏం చేశారో తెలుసా?

తెలంగాణలో ఓ వ్యక్తి.. భార్యను దేవతగా భావిస్తున్నారు.. ఆమెను నిత్యం స్మరించుకుంటున్నారు. అంతే కాదు. భార్య విగ్రహాన్ని నిర్మించారు. నిర్మించడమే కాదు. నిత్యం పూజలు చేస్తున్నారు.

ఆయనకు భార్య అంటే ప్రాణం.. ఆమె తీపి జ్ఞాపకాలు మరిచిపోలేక ఏం చేశారో తెలుసా?
Worships The Idol
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 22, 2024 | 5:25 PM

తెలంగాణలో ఓ వ్యక్తి.. భార్యను దేవతగా భావిస్తున్నారు.. ఆమెను నిత్యం స్మరించుకుంటున్నారు. అంతే కాదు. భార్య విగ్రహాన్ని నిర్మించారు. నిర్మించడమే కాదు. నిత్యం పూజలు చేస్తున్నారు. భార్య బతికి ఉండగానే. ఆమె విగ్రహం తోపాటు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఇతడు దేవాలయంగా తీర్చిదిద్ది పూజలు చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన జొంగోని ముత్తయ్య 30 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు ఇద్దరు బతికుండగానే విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతని భార్య లక్ష్మి 14 సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పటి నుండి భార్య లక్ష్మి విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నాడు. ముత్తయ్య చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు వీరయ్య, రాజవ్వ చనిపోవడంతో ఖననం చేయాలంటే, గుంట భూమి కూడా లేకపోవడంతో ఆ కష్టం తన పిల్లలకు రావద్దు అన్న ఉద్దేశంతో ముత్తయ్య ఈ పనికి పూనుకున్నట్లు తెలిపారు.

ముత్తయ్య తన పొలం వద్ద బతికుండగానే భార్యాభర్తల ఇద్దరి విగ్రహాలను నిర్మించుకున్నారు. వాటి ముందు సమాధి కోసం స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విగ్రహాల దగ్గర.. శివ లింగం కూడా ఏర్పాటు చేశాడు. ఆమె విగ్రహానికి దేవుడు కంటే ఎక్కువ పూజలు చేస్తారు. ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు ఇక్కడే గడుపుతాడు.. ఉదయం విగ్రహాన్ని శుభ్రం చేస్తాడు. తరువాత పువ్వు లతో అలంకరణ చేస్తాడు. మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తారు. ఆమె వర్ధంతి సందర్బంగా కుటుంబ సభ్యులు హాజరువుతారు. రోజంతా. ఇక్కడే గడుపుతారు. ముత్తయ్య కు భార్య ఫై ఉన్న ప్రేమ చూసి చాలా మంది ఆనందపడుతున్నారు. ఈ విగ్రహాలను చూడటానికి చుట్టూ పక్కల వారు వస్తు ఉంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..