Telangana News: వయసు 5 నెలలే.. ప్రపంచ రికార్డుల్లో చోటు.. ఈ చిన్నారి తెలివికి సలాం!
5 నెలల చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మెడల్ లభించింది. ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. అడిగిన వెంటనే టక్కున చిన్నారి చూపిస్తుంది.
ఆ చిన్నారి వయస్సు కేవలం ఐదు నెలలే,అప్పటికి తల్లిదండ్రులని గుర్తు పట్టడం కూడా చాల కష్టం. కాని ఈ చిన్నారి మాత్రం అద్భుతమైన ప్రతిభతో పలువురిని ఆకట్టుకుంటుంది. ఫ్లాష్ కార్డులని చూపిస్తే చాలు ఠక్కున చేయితో గుర్తుపట్టి చూపెడుతుంది. ఈ చిన్నారి ప్రతిభని చూసి స్థానికులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన పావనీ వంశీలకి రెండవ సంతానంలో శ్రీకృతి జన్మించింది. ఈ చిన్నారి వయస్సు ఇప్పుడు ఐదు నెలలు.. ఈ చిన్నారి చురుకుదనం చూసి ఏదో ఒకటి నేర్పించాలని తల్లి భావించింది. ఈ క్రమంలో ఫ్లాష్ కార్డులని చూపెట్టి ముందుగా వివరించింది. తరువాత చిన్నారికి చూపెట్టగానే వెంటనే ఆ ఫ్లాష్ కార్డు పట్టుకుంటుంది. ఎక్కడ కూడ తప్పుచేయకుండా అమ్మ చెప్పిన ప్లాష్ కార్డును చేతితో తాకుతుంది. ప్లాష్ కార్డులోని అల్పాబెట్స్, పక్షులు, జంతువులి, పండ్లని అలవోకగా గుర్తు పడుతుంది. ఏది అడిగిన వెంటనే ప్లాష్ కార్డు వద్దకి చిన్నారి చేతి వెళుతుంది. వందకి పైగా ప్లాష్ కార్డులో ఉన్న సింబల్స్‌ని గుర్తుపట్టి ఔరా అనిపిస్తుంది.ఈ చిన్నారి ప్రతిభని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చిన్నారి గుర్తించే విధానాన్ని చూడడానికి స్థానికులు వస్తున్నారు. అయితే చిన్నారి ప్రతిభని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు యంగెస్ట్ టూ ఐడెంటిటీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనితో ఆ సంస్థ ప్రతినిధులు కూడా చిన్నారి ప్రతిభని గుర్తించి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్‌కి ఎంపిక చేసారు. ఈ మెడల్‌కి చిన్నారి ఎంపిక కావడంతో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వారి తల్లిదండ్రులని అభినందించారు. ఇంత చిన్న వయస్సు ఉన్న చిన్నారి వస్తువులని గుర్తు పట్టడంతో ఈ ప్రాంతంలో అసక్తిగా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అమె చురుకుదనాన్ని అర్థం చేసుకుని ప్లాష్ కార్డుల ద్వారా గుర్తులని గుర్తుపట్టే విధంగా నెర్పించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్కడ తప్పు లేకుండా గుర్తుపట్టడం తమకి ఎంతో ఆనందంగా ఉందని పేరెంట్స్ చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి