Warangal: ప్రతిష్ఠించిన చోటే పాలతో 40 అడుగుల మట్టిగణపతికి నిమజ్జనం

వరంగల్​ ఎల్లంబజార్​లో ప్రతిష్ఠించిన 40 అడుగుల మట్టి గణపతికి నిమజ్జనం నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.2,26,116 పలికింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Warangal: ప్రతిష్ఠించిన చోటే పాలతో 40 అడుగుల మట్టిగణపతికి నిమజ్జనం
40 Feet Clay Ganapati
Follow us

|

Updated on: Sep 22, 2024 | 9:53 PM

వరంగల్ చరిత్రలో తొలిసారి ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. 15రోజులపాటు పూజలు అందుకున్న గణపయ్యను ఐదు వేల లీటర్ల పాలతో నిమజ్జనం చేశారు. ప్రతిష్టించిన ప్రదేశంలోనే ఉత్సవ కమిటీతోపాటు వేదమంత్రోచ్చరణల మధ్య గణనాథుడ్ని కరిగించారు. వరంగల్‌ ఎల్లమ్మబజార్‌లో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమానికి భక్తులు పెద్దయెత్తున తరలివచ్చారు. గణపయ్యను కరిగించగా వచ్చిన మట్టిని భక్తులకు అందజేస్తారు.

15 రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు మట్టి గణపతిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నిమజ్జనోత్సవానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వరంగల్‌ భక్తులు. అయితే నిమజ్జనం నీళ్లను కాలువలోకి మళ్లించడంతో  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. వరంగల్‌లో 40అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు దాదాపు 70 రోజులపాటు శ్రమించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గణేశ్ వద్ద ఏకంగా 365 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఈ భారీ లడ్డూ 2 లక్షల 26 వేల 116 రూపాయలు పలికింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..