Telangana: రిటైర్డ్ టీచర్ ఇంట్లో చోరీ.. మాస్టర్ స్కెచ్ ఎవరిదో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితుడు ఎవరో తెలిసి స్థానికులంతా ఆశ్చర్యపోయాడు.

Telangana: రిటైర్డ్ టీచర్ ఇంట్లో చోరీ.. మాస్టర్ స్కెచ్ ఎవరిదో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం
Robbery At Rtd Teacher Home
Follow us

|

Updated on: Oct 22, 2022 | 7:55 PM

చోరీ కథా చిత్రమ్‌లో దృశ్యం సినిమాటిక్‌ స్కెచ్‌.. ఆ బడి మాస్టారు. ఎంతోమంది విద్యార్ధులకు చదువు చెప్పారు. ఇటీవలే పదవి విరమణ బెనిఫిట్స్‌ వచ్చాయి. . ఈయనకు ఇద్దరు భార్యలు. అదో వివాదా కథా చిత్రమ్‌. రిటైర్మెంట్‌ లైఫ్‌ సాఫీగా వుండాలని సింగిల్‌‌గా ఉంటున్నారు. బంధుమిత్రులు వస్తుంటారు. మాట్లాడుతుంటారు. అలా కాలక్షేపం నడుస్తూ వుంటుంది. రెండో భార్య మేనల్లుడు అనంతయ్య కూడా అడపాదడపా వచ్చి మామా అని పలకరించి వెల్లేవాడు. పనిలో పనిగా ఆ ఇద్దర్నీ వెంటేసుకొచ్చాడు. మామా ఇదిగో వీళ్లు మీ శిష్యులని పరిచయం చేశాడు. నిజమేనని నమ్మారు మాస్టారు. కానీ వీళ్లు దొంగ శిష్యులని తెలిసే సరికి ఇల్లు గల్లా అయింది. సారూ సారు అంటూ నమ్మించి.. మద్యం తాగించి..ఇంటి తాళలు తస్కరించి.. 17 లక్షల నగదు, ఐదు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు అనంతయ్య అండ్‌ బ్యాచ్‌. కొట్టేసిన సొత్తును ఎంచక్కా పంచేసుకున్నారు కూడా. కానీ సీసీ టీవీ పోలీసింగ్‌తో  కేటుగాళ్లను కటకటాల బాటపట్టించారు జోగిపేట పోలీసులు

ఇంతకీ ఆ మాస్టారు పేరు లక్ష్మీనారాయణ. ఆయన మేనల్లుడు అనంతయ్య, అండ్‌ బ్యాచ్‌ సినిమాటిక్‌గా మద్యం ఎరవేసి మాస్టార్‌ను బోల్తా కొట్టించారు. అదెలాగంటే.. మామ బీరువా తాళం చెవి బండి కీస్‌కే పెడుతాడని పసిగట్టాడు అనంతయ్య. లక్ష్మినారాయణకు మద్యం అలవాటు వుందని కూడా వాళ్లకు తెలుసు. న్యాక్‌గా మద్యం పార్టీకి పిలిచారు. ఇక ఆ తరువాత ప్లాన్‌బి..అంటే బిర్యానీ పొట్లం..బీరువాలో చోరీ చిత్రమ్‌.  అలా ఎత్తుకెళ్లిన సొమ్మును ..వాటాల పంచేసుకొని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు నిందితులు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కూపీలాగితే ఫైవ్‌ మెంబర్డ్‌ గ్యాంగ్‌ బండారం బయటపడింది.

అలా సింగూర్‌ దగ్గర నిందితుల సీన్‌ సితార్‌ చేశారు పోలీసులు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన జోగిపేట పోలీసుల్ని అభినందించారు సంగారెడ్డి డీఎస్పీ రవీందర్‌రెడ్డి . ఇక దొంగల్లుడు అనంతయ్య సహా ఐదుగురు నిందితులను అల్రెడీ అత్తారింటి బాటపట్టించారు. సారు క్యాష్‌ సారుకు చేరింది. కానీ కథ చూశారు కడా ….. బంధువుల్లో దొంగ బంధువులు వేరయా జరతస్మాత్‌ జాగ్రత. అపరిచితులనే కాదు.. పరిచయస్తులను సైతం అనుమానంగా చూడాల్సిన రోజులు ఇవి మరి. కీడెంచి మేలించి.. ఎవరి జాగ్రత్తలో వాళ్లలో ఉండాలంటారే.. అదిగో ఆ మాటకు ఈ స్టోరీనే ఓ నిదర్శనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..