సాగర్ డ్యామ్ లో యువకుడు గల్లంతు

Telangana youth Drowns In krishna River Near Nagarjuna Sagar Dam

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన సందర్బంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉప్పొంగుతున్న కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే సాగర్ అందాలను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. జహీరాబాద్ కు చెందిన కొందరు యువకులు సాగర్ సందర్శనకు వచ్చారు. వారంతా  శివాలయం ఘాట్ దగ్గర స్నానాలు చేస్తుండగా వరద ఉధృతికి నర్సింహ అనే యువకుడు నీటిలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో విహార యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *