రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచన ఉందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర తీరం అనుకొని బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని.. మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం […]

రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు..!
Follow us

|

Updated on: May 26, 2020 | 3:49 PM

తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచన ఉందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర తీరం అనుకొని బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని.. మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగనుంది. రాగల మూడు రోజుల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.