రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాల కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎండీ భాస్కరాచారి..!

చేయి త‌డ‌ప‌నిదే ప‌ని చేయ‌ని అధికారుల భ‌ర‌తం ప‌డుత‌న్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. తాజాగా మ‌రో అవినీతి అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాల కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎండీ భాస్కరాచారి..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 4:59 PM

Warehousing corporation ACB trap : ఏసీబీ అధికారుల చేతికి భారీ అవినీతి తిమిగ‌లం చిక్కింది. చేయి త‌డ‌ప‌నిదే ప‌ని చేయ‌ని అధికారుల భ‌ర‌తం ప‌డుత‌న్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. తాజాగా మ‌రో అవినీతి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. రిటెర్డ్ సొమ్మును ఇచ్చేందుకు లంచం అడిగారన్న స‌మాచారంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఉద్యోగి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్ మంజూరు కోసం రూ.75 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత సొమ్ము చెల్లించలేని ఆ ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కాగా ఫ్లాన్ చేసిన అధికారులు.. భాస్కరాచారితో పాటు జీఎం సుధాకర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం మార్క్‌ఫైడ్, హాకా, గిడ్డంగుల శాఖలకు భాస్కరాచారి మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

గుడివాడ ఎస్‌ఐ సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌… ఆమె పరిచయం అతని కొంపముంచిందా..?