Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

8900 కిలోల పేలుడు పదార్థాలు సీజ్.. ఎక్కడంటే..?

నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్‌ పెట్టారు. పేలుడు పదార్థాలను తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండు వాహనాల్లో మొత్తం 8900 కిలోల పేలుడు పదార్ధాలు (376 బూస్టర్స్‌), మరో వాహనంలో 165 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్‌ను గుర్తించారు. పేలుడు పదార్థాలతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.

వివరాల్లోకి వెళితే.. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో రీజెనసిస్ అనే పేలుడు పదార్థాలకు సంబంధించిన కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ నుంచి లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుంటారు. మల్లారం గ్రామానికి చెందిన శ్రావన్‌రెడ్డి, సిద్దిపేట్‌కు చెందిన నారాయణలు ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తులు. వీరికి ఈ పేలుడు పదార్థాలను విక్రయించేందుకు డీలర్‌షిప్ కూడా ఉన్నది. అయితే బొమ్మలరామారం నుంచి ఈ పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే వీరిద్దరూ కలిసి ఈ పదార్థాలను అక్రమంగా విక్రయించడం ప్రారంభించారు. బొమ్మలరామారం నుంచి కొనుగోలు చేసిన పేలుడు పదార్థాలను కీసర మండలం వన్నీగూడలోని హర్ష స్టోన్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా వీరు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌తో వీరికి చెక్ పెట్టారు. రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు..పేలుడు పదార్థాలను తరలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కీసర పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే శ్రావన్‌రెడ్డి, నారాయణలను అదుపులోకి తీసుకొన్నారు.