సందర్శకులను తగ్గించేందుకు ఆ తహశీల్దార్ ఏం చేశాడంటే..

రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది వినూత్న పద్దతిలో ప్రజలకు సేవలందిస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే వారి సమస్యల ఆన్ లైన్ లోనే పరిష్కారానికి శ్రీకారం చుట్టారు మంచిర్యాల రెవిన్యూ శాఖ అధికారులు.

సందర్శకులను తగ్గించేందుకు ఆ తహశీల్దార్ ఏం చేశాడంటే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2020 | 4:11 PM

రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది వినూత్న పద్దతిలో ప్రజలకు సేవలందిస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే వారి సమస్యల ఆన్ లైన్ లోనే పరిష్కారానికి శ్రీకారం చుట్టారు మంచిర్యాల రెవిన్యూ శాఖ అధికారులు.

కోవిడ్ -19 వ్యాప్తి చెందడంతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే సందర్శకుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో రెవిన్యూ సిబ్బంది సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. నిత్యం 150 మందికి పైగా ఫిర్యాదుదారులు మండల కార్యాలయానికి వస్తుంటారు. ఇప్పటికే మీ సేవా ద్వారా ఈ పాలనా సౌలభ్యం ఉన్నప్పటికీ కొందరు నేరు తహశీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇక మీదట నేరుగా రావాల్సిన అవసరం లేదు. ఒక్క వాట్సాఫ్ ద్వారా మెసేజ్ పంపండి. మీ సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు మంచిర్యాల మందమర్రి రెవిన్యూ అధికారులు.

ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు. ముందుగా తమ సమస్యలను గ్రామ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని మండలాధికారులు సూచిస్తున్నారు. అదీకూడా వాట్సాఫ్ ద్వారా పంపాలంటున్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామంటున్నారు. వారి సమస్యలు ఇంకా పరిష్కారం దొరకకుంటే నేరుగా తన వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపవచ్చంటున్నారు మందమర్రి తహశీల్దార్ మోహన్ రెడ్డి. అవసరమైతే ఇ-మెయిల్ ద్వారా తనను సంప్రదించమని చెబుతున్నారు. స్థానిక పరిపాలనకు సంబంధించి అనేక వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నామని, దీన్ని స్వయంగా తహశీల్దార్ మానిటర్‌ చేస్తున్నారని మండలాధికారులు చెప్పారు. రెవిన్యూ కార్యాలయాలకు తక్కువ స్థాయిలో సందర్శకుల వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు